Advertisement
ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇన్కమ్ టాక్స్ లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇన్కమ్ టాక్స్ స్లాబ్స్ లో పన్ను రాయితీ పరిమితి పెంపు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో డేట్ మ్యూచువల్ ఫండ్స్ పై పన్ను విధింపు వంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు సామాన్యులకు ఊరటనిస్తే, మరికొన్ని మార్పులు భారం అవ్వనున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
పన్ను రాయితీ పరిమితి పెరుగుదల :
ఇక నుంచి పన్ను రాయితీ పరిమితి రూపాయల 5 లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు పెరిగింది. ఏడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులకు ఫ్లేమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు.
Advertisement
స్టాండర్డ్ డిడక్షన్ లో లేని మార్పులు:
పాత పన్ను విధానంలో ఉద్యోగుల అందించిన 50వేల స్టాండర్డ్ డిడక్షన్ లో ఎలాంటి మార్పులు లేవు. అయితే పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు. రూ..52,500ప్రయోజనాన్ని పొందుతారు.
Also Read: దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్ వెనక ఇంత కథ ఉందా..?
సీనియర్ సిటిజన్స్ కు ఊరట :
ఇక సీనియర్ సిటిజన్ ల సేవింగ్స్ స్కీం గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.. 30 లక్షలకు పెరిగింది. గతంలో డిపాజిట్ రూ..15 లక్షల వరకు మాత్రమే ఉండేది. దీనివల్ల మంత్లీ ఇన్కమ్ స్కీం లో సింగిల్ అకౌంట్ కలిగినటువంటి వ్యక్తి కేవలం 4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్లను 9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ లో రూ.7.5 లక్షలు గా ఉన్న పరిమితిని రూ.. 15 లక్షల వరకు పెంచేశారు.
Also Read: దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్ వెనక ఇంత కథ ఉందా..?