Advertisement
పూర్వకాలంలో ప్రతి ఇంట్లో చెక్క ద్వారా తయారుచేసిన కుర్చీలు మాత్రమే ఉండేవి. అవి ఎంతో బలంగా, దృఢంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మోడ్రన్ కు అందరూ అలవాటు పడ్డారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు అనే విధంగా ప్రతి ఒక్కటి వారికి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటున్నారు. ఇంట్లో డోర్ కాటన్ నుంచి మొదలు కూర్చునే కుర్చీల వరకు అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ కుర్చీలో ప్రతిరోజు కూర్చుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆ కుర్చీ మధ్యలో ఉండే హోల్ ఎందుకు పెడతారో ఆలోచించారా.. ఆలోచించలేదు కదూ.. ప్లాస్టిక్ కుర్చీ మధ్యలో హోల్ పెట్టడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి అవేంటో ఓసారి తెలుసుకుందాం..?
Advertisement
1.కుర్చీలు ఒకదానిమీద ఒకటి పేర్చి నప్పుడు వాటి మధ్యలో కొంత వ్యాక్యూమ్ ప్రెజర్ ఏర్పడుతుంది. ఆ సమయంలో కుర్చీ మధ్యలో హోల్ లేకపోతే ఆ మధ్యన ఉండే గాలి వల్ల అవి చాలా టైట్ గా ఇరుక్కుపోయి అవకాశం ఉంది.
Advertisement
2.ముఖ్యంగా కుర్చీ తయారు చేసేటప్పుడు కొంత మెటీరియల్ సేవ్ చేయడం కోసం, తక్కువ ఖర్చులో కుర్చీని తయారు చేయడం కోసం ఈ హోల్ పెడతారు.
3.ఈ హోల్ ఉండటంవల్ల వీటిని చాలా సింపుల్ గా సింగర్లతో పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
4.ప్లాస్టిక్ స్టూల్స్ పైన ఉన్నటువంటి రంధ్రాలు సర్కిల్ షేప్ లోనే ఉంటాయి. స్క్వేర్ షేప్ లో అస్సలు ఉండవు. ఈ సర్కిల్ షేపులో హోల్స్ ఉండడంవల్ల దాని బిల్ట్ క్వాలిటీ పెరుగుతుంది. ఎలాగంటే మనం కూర్చున్నప్పుడు విరిగి పోకుండా కాపాడడం కోసం. ఉదాహరణకు ఒక ఎక్కువ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నాడు అనుకుంటే, ఆ సమయంలో ఈ ప్లాస్టిక్ పై క్రియేట్ అయిన ప్రెజర్ అన్ని వైపుల నుంచి వచ్చి హోల్స్ ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది.
Also Read: పక్షులు కరెంట్ తీగలపై అలా కూర్చుంటే ఎందుకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా..?