Advertisement
ప్రస్తుత కాలంలో ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ చాలామంది కులం, మతం, అంతస్తు చూస్తూ అమ్మాయిలకు అబ్బాయిలకు నచ్చిన వారిని అస్సలు పెళ్లి చేయడం లేదు. ఇక అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తే ఒకవేళ విషయం ఇంట్లో తెలిసిందంటే చాలు ఆ ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు కులం ఏంటి అని తెలుసుకొని, ఒకవేళ తల్లిదండ్రులకు నచ్చినట్టు లేకుంటే మరో అబ్బాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. అమ్మాయి మనసు అసలు అర్థం చేసుకోవడం లేదు.
Advertisement
దీనివల్ల పెళ్లి చేసిన తర్వాత చాలామంది అమ్మాయిలు క్రూరమైన ప్రవర్తనతో అనేక సమస్యలు తీసుకువస్తున్నారు. అలా ఈ అమ్మాయి కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం చేసిందో చూద్దామా.. కర్ణాటకకు చెందిన ఆనంద్, మమతలది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి పెళ్లయి నాలుగేళ్లయింది. రోజు గొడవలు అయ్యేవి. ఇక వీరు ఒంటరిగా ఉంటే ఆయన కరెక్ట్ గా ఉంటారని అత్త మామ వీరికి సపరేట్ రూమ్ చూసి ఉంచారు. అయినా వీరి గొడవలు ఆగలేదు. కట్ చేస్తే ఓ రోజు బాత్రూంలో ఆనంద్ రక్తం మడుగులో కనిపించాడు. చేయి కోసుకొని ప్రాణాలు తీసుకున్నట్లుగా ఆ సీన్ చూస్తే అర్థమయింది. సరిగ్గా రెండు నెలల తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది.
Advertisement
అది ఆ** త్య కాదు హత్య అని తేలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మమతను వారి స్టైల్లో విచారించారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే హరీష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతనితోనే జీవితం అనుకుంది. కానీ తల్లిదండ్రులు ఆనందుతో పెళ్లి ఫిక్స్ చేసేసారు. ఈ సమయంలోనే హరీష్ తో ఒక ప్లాన్ వేసింది. పెళ్లి చేసుకొని అతని ఆస్తి కొట్టేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసిందట. అనుకున్నట్టుగానే వీరు వేరే రూమ్ లో కాపురం పెట్టగానే ప్లాన్ అమలు చేసింది. చివరికి ఆనంద్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయింది.
మరి కొన్ని ముఖ్య వార్తలు: