Advertisement
సాధారణంగా మానవుడి శరీరంలో అధిక పరిమాణంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా తీవ్ర కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులే కాకుండా చాలా మందిలో వెన్ను, నడుము నొప్పులు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాలి. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఊబకాయం అనే ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
ఈ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యనిపుణుల సూచనల మేరకు శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్లను డైట్ లో భాగంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిణామాలు నియంత్రణలో ఉండి.. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని ఆరోగ్యంగా చెబుతున్నారు. తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతీరోజూ స్విమ్మింగ్ తో పాటు యోగ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కండరాలు చాలా దృఢంగా మారి శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
Advertisement
తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడే వారు తప్పకుండా డాక్టర్ల సలహాలను పాటించాలి. సరైన సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ ప్రతీరోజూ ఔషదాలను తీసుకోవాలి. దీంతో నొప్పులు మాయమవుతాయి. ఔషదాల వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.. కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. డైట్ తో పాటు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురయ్యే వారిలో కీళ్ల నొప్పులు అధికంగా వస్తున్నాయి. ఎంత సులభంగా ఒత్తిడిని నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
20 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్లు
పవిత్ర లోకేష్ అప్పట్లో స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం అదేనా ?