Advertisement
సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చిరాకు తెప్పిస్తుందనే చెప్పాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా మనుషులపై పగ పెంచుకొని మరణానికి కారణం అవుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను సొంత తమ్ముడితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ సంఘటన సంచలనంగా మారింది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. బాపట్ల పరిధిలోని నందిరాజుతోట గ్రామంలో జొన్న గోపయ్య-కృష్ణవేణి (21) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. పెళ్లైన అప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా గడిపారు. కొద్ది రోజులకు వీరికి ఓ కూతురు జన్మించింది. ప్రస్తుతం కృష్ణవేణి గర్భవతి. ఇదిలా ఉంటే.. భర్త గోపయ్య హైదరాబాద్ లోని ఓ ఎయిర్ పోర్టులోని హోటల్ లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య మాత్రం అత్తగారింటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణవేణి స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అత్తమామలతో పాటు మరిది కూడా అనుమానించారు. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతుండేవి.
Advertisement
ఇటీవల ఓ రోజు రాత్రి సమయంలో కృష్ణవేణి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుందని అన్న గోపయ్యకు ఫోన్ చేసి వివరించాడు శివబాబు. దీంతో అతడు అప్పటికప్పుడు ఇంటికి చేరుకున్నాడు. పక్కా ప్లాన్ తోనే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కృష్ణవేణిని చితకబాదారు. దీంతో ఆమె మరణించింది. ఆ తర్వాత కృష్ణవేణి బాత్రూమ్ లో ఉరి వేసుకుందనీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు అన్నదమ్ములు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త గోపయ్య, అతని తమ్ముడు శివబాబులతో పాటు వారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
పనిలోంచి తీసేశాడని ప్రేమ జంట వృద్ధుడిని ఏం చేశారో తెలుసా ?
సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. అంత నరకం అనుభవించిందా ?