Advertisement
సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థానంలో ఉండాలని కోరుకుంటారు. తమ పిల్లలు ప్రయోజకులు అయిన తరువా పెళ్లి చేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలనుకుంటారు. ఇలాగే ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటున్న వారికి ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో వారు ఆశ్చర్యపోయారు.
Advertisement
ప్రస్తుతం ఆలోచన విధానాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువతీ, యువకులు ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డ తరువాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. కొంత మంది పెళ్లి చేసుకున్న వారికి జరుగుతున్న గొడవలు చూసి అసలు పెళ్లి వద్దు బాబోయ్ అనే ఆలోచనలో కూడా ఉన్నారు.పెళ్లితో బంధం ఏర్పడటంతో పాటు బాధ్యతలు కూడా మీద పడుతాయి. వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు అనుభవించాల్సి వస్తుంది. వీటన్నింటినీ భరించలేకనేనేమో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.
Advertisement
హైదరాబాద్ నగరంలోని మూసాపేటలో నివసిస్తున్న ఝాన్సీ(25) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లి వయస్సు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఝాన్సీ మాత్రం పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. ఇందుకు కారణం ఇరుగు, పొరుగు వాళ్ల ఇళ్లలో భార్య, భర్తల మధ్య చోటు చేసుకుంటున్న గొడవలు, వాగ్వాదాలు అని చెప్పింది. అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం మానడం లేదు. తనకు ఎక్కడ పెళ్లి చేస్తారోనని భయపడి ఝాన్సీ ఉరేసుకుంది. తమ కూతురుకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలనుకున్న తల్లిదండ్రులు తమ కూతురు విగతజీవిగా మారడం చూసి కన్నీరు పెడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :