Advertisement
సాధారణంగా ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానం. ఎందుకంటే దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ.. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కాబట్టి వారు మనకు దైవంతో సమానం. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి పెంచి, పెద్ద చేసి అభివృద్దిలోకి తీసుకురావడంలో వారి కృషి ఎనలేనిదనే చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే కృషి మామూలు విషయం కాదనే చెప్పాలి.
Advertisement
పిల్లలు పుట్టేంత వరకు భార్య, భర్తలది ఒకరకమైన జీవితం. ఇక ఆ తరువాత మరో రకమైన జీవితమనే చెప్పవచ్చు. పిల్లలు పుట్టిన తరువాత పేరెంట్స్ లైఫ్ పూర్తి మారిపోతుంది. తల్లిదండ్రులు ఏం చేసినా వారి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. తమ సంతోషాల కంటే పిల్లల సంతోషమే ముఖ్యం అని భావిస్తుంటారు. వారికి ఏది కొనిచ్చినా తెగ సంతోషపడుతారు. వారి కళ్లలో నుంచి చిన్న కన్నీటి బొట్టు వచ్చినా తట్టుకోలేరు. పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. వారి కోసం తమ లైఫ్ ని త్యాగం చేసే పేరెంట్స్ కి ఏమి ఇచ్చినా రుణం తీరదు.
Advertisement
తల్లిదండ్రుల రుణం తీర్చుకోకపోయినా పర్వాలేదు కానీ.. వారికి శ్లోకాన్ని మిగల్చవద్దని పెద్దలు అంటుంటారు. కొంతమంది పిల్లలు తమ జీవితానికి సంబంధించి తీసుకునే పలు నిర్ణయాలు పేరెంట్స్ కి శరఘాతంలా మారుతాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న ఓ కూతురు.. తన తల్లిదండ్రులకు శ్లోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకరమైన ఘటన గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో చోటు చేసుకుంది. బనస్కాంతకి చెందిన ఓ యువతి కొద్ది రోజుల కిందట తన ప్రియుడితో కలిసి పారిపోయి వివాహం చేసుకుంది. పోలీసులు ఆమెను వెతికి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అయినప్పటికీ ఆ యువతి మాత్రం తన భర్తతోనే కలిసి ఉంటానని వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆ యువతి తల్లిదండ్రులు చాలా సేపు బతిమిలాడి.. కాళ్లు పట్టుకొని గుండెలవిసేలా ఏడ్చినా కనికరించలేదు. తన భర్తతో కలిసి ఉంటానని ఆమె వెళ్లిపోయింది. కూతురి కాళ్లు పట్టుకొని తండ్రి ఏడుస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :