Advertisement
దేవుడికి మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. అనుకున్నవి పూర్తి అవుతాయి అని చాలామంది భావిస్తారు. దేవుడిని పూజించడానికి కూడా ఎన్నో పద్ధతులు ఉంటూ ఉంటాయి. కొన్ని ఆలయాల్లో అయితే కొంచెం విభిన్నమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. సాధారణమైనవి కాకుండా కాస్త కొత్తగా ఉంటాయి అవి. రాజస్థాన్లోని రణధంబోర్ లో వినాయక ఆలయం ఉంది ఈ ఆలయంలో పాటించే పద్ధతి కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఇక దాని గురించి మనం చూసేద్దాం.
Advertisement
భక్తులు వారి కోరికలు నెరవేరాలని ఇక్కడ వినాయకుడిని ఎలా ప్రార్థిస్తారు అంటే.. వారి కోరికలు తీర్చమని దేవుడికి ఉత్తరం రాస్తారు. ఇంట్లో జరగనున్న శుభకార్యాలకి కూడా వినాయకుడిని పిలుస్తారు. ఉత్తరం రాస్తారు. ఒకవేళ కోరిక నెరవేరితే భక్తులు వినాయకుడికి కృతజ్ఞతలు చెప్తారు అదికూడా మళ్లీ లేఖ రాస్తారు. రోజూ ఈ వినాయకుడికి 20 కేజీలకి పైగా ఉత్తరాలు వస్తాయి. వాటన్నిటిని పూజారే చదివి వినిపిస్తారు. తర్వాత వాటన్నిటినీ స్వామి వారి పాదాల దగ్గర పెడతారు.
Advertisement
ఇక్కడ ఇలా ఉత్తరం రాస్తే వాళ్ళు అనుకునేవి జరుగుతాయని వారి నమ్మకం. ఈ వినాయకుడి ఆలయాన్ని పదవ శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించారు. ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం అయినప్పుడు హమీర్ రాజ్యంలోని ఖజానా లో ఉన్న సామాగ్రి అంతా పోయింది. ఇక ఓటమి తప్పదు అనుకున్నాడు. ఏడేళ్లు యుద్ధం అయింది హమీర్ వినాయకుడికి గొప్ప భక్తుడు. నువ్వే గెలుస్తావు తెల్లారితే యుద్ధము ఆగిపోతుంది అని హమీర్ కి వినాయకుడు కలలో కనపడి చెప్పారట. వినాయకుడు చెప్పినట్టే జరిగింది.
హమీర్ కోట గోడకి చెక్కిన శిల్పంలా వినాయకుడు ప్రతిమ స్వయంగా వెలసింది. ఆ విగ్రహానికి మూడు కళ్ళు ఉన్నాయి. హమీర్ ఆ విగ్రహాన్ని చూసి వెంటనే అక్కడే ఆలయాన్ని కట్టేశారు. ఇప్పుడు ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు. మూడు కళ్ళు ఈ వినాయకుడికి ఉండడంతో త్రినేత్ర వినాయకుడు అని పిలుస్తారు.
Also read: