Advertisement
చాలా మంది ఎక్కువ సేపు టాయిలెట్ సీట్ మీద కూర్చుంటూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని వాష్ రూమ్ లో గడుపుతుంటారు. నిజానికి టాయిలెట్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఐదు నిమిషాలు సరిపోతుంది. ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లయితే ప్రమాదంలో పడ్డట్టే. మీరు కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు టాయిలెట్ సీట్ పై కూర్చుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని చూడాల్సిందే..
Advertisement
ఎప్పుడూ కూడా బాత్రూంలో ఎక్కువసేపు కూర్చోకూడదు. పని పూర్తి చేసుకుని బయటికి వచ్చేయాలి. చాలా మంది న్యూస్ పేపర్ చదవడం, ఫోన్ చూడడం వంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి అలవాట్లు ఆరోగ్యానికి నేరుగా హాని చేస్తాయి. అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. బ్రిటన్ లో చేసిన సర్వే ప్రకారం అక్కడ ప్రజలు వారానికి సగటున మూడున్నర గంటలు బాత్రూంలోనే గడుపుతున్నారని తెలుస్తోంది.
Advertisement
ఒక వ్యక్తి ఒక్కసారి బాత్రూంలో ఐదు నిమిషాలు ఉంటున్నారని రోజుకి నాలుగు నుండి ఏడు సార్లు టాయిలెట్ కి వెళ్తారని సర్వే ద్వారా తెలుస్తోంది. ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు టాయిలెట్ మీద కూర్చోవడం వలన పైల్స్ సమస్య వస్తుంది. లోపల రక్తనాళాలు ఎర్రబడతాయి. ఒక ముద్దగా ఏర్పడి ఫైల్స్ కి దారితీస్తుంది. అలానే అదనపు ఒత్తిడి కూడా పడుతుంది. ఇలా పైల్స్ సమస్య రావచ్చు. ఎక్కువ సేపు కూర్చున్నా, బలవంతం చేసినా పురీషనాళం నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం వుంది. ఒకవేళ కనుక పైల్స్ సమస్య పెద్దదైతే కచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. లేదంటే మాత్రం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
Also read: