Advertisement
అక్కినేని అమలు అందరికీ సుపరిచితమే. సినిమాతో అందరికీ ఈమె పరిచయమైంది. కానీ మొట్టమొదట ఈమె నృత్యకారిణి. అమల తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. తండ్రి ఏమో బెంగాలీ. అమల రుక్మిణి ఆరండేల్ దగ్గర శాస్త్రీయ నృత్య శిక్షణ పొందారు. తమిళ దర్శకుడు భారతి రాజా దర్శకత్వంలో వైశాలి అనే సినిమాలో నటించారు. అమల ఆ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేశారు తెలుగులో ఈమె చిన్న బాబు సినిమాలో మొట్టమొదట నటించారు. ఆ సినిమాకి డాక్టర్ డి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు.
Advertisement
ఆ సినిమాలో నాగార్జున హీరోగా నటించడంతో వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫైనల్ గా వీళ్ళు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. 1993లో వీళ్ళ పెళ్లి జరిగింది. 1994లో అఖిల్ పుట్టాడు. అమల ప్రస్తుతం కుటుంబ బాధ్యతతో పాటుగా జంతు సంక్షేమ కార్యకర్తగా బ్లూ క్రాస్ సొసైటీ ని ముందుకు నడిపిస్తోంది. నాగార్జున కి ప్రతి విషయంలో కూడా ఆమె సహాయం చేస్తుంది. చేదోడు వాదోడుగా నిలుస్తుంది.
Advertisement
ఒకానొక సమయంలో నాగర్జున మనకి అఖిల్ ఒక్కడే ఉన్నాడు కదా ఇంకొకరిని ప్లాన్ చేద్దామని అడిగితే.. అమల మనకు ఇద్దరు కదా అని చెప్పిందట. దాంతో నాగార్జున షాక్ అయిపోయారు ఎంతో మంచిగా అమల ఆలోచించింది అనుకున్నారు. నిజానికి ఒక్కో సమయంలో నాగచైతన్యకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా అఖిల్ కి వీళ్ళిద్దరూ ఇవ్వలేదు.
ఇది ఇలా ఉంటే నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా సినిమాల్లో మంచి హిట్ లభించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాగ చైతన్య ఒక విధంగా పరవాలేదు కానీ అఖిల్ మాత్రం మంచి హిట్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. సరైన హిట్ ఇంకా లభించలేదు. మంచి హిట్ కనుక అఖిల్ కి వచ్చిందంటే కచ్చితంగా అఖిల్ పెద్ద హీరో అవుతాడు.
Also read: