Advertisement
రస్నా యాడ్ ని మీరు చూసారా..? రస్నా యాడ్ లో నటించి పాపులర్ అయింది అంకిత. ఆ తర్వాత ఆమె లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కూడా నటించి, అందరికీ పరిచయం అయింది. వైవిఎస్ చౌదరి ఫస్ట్ ఫిలిం తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంకిత ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమలో పావని కళ్యాణ్, సింహాద్రి వంటి సినిమాలు చేసింది సింహాద్రి సినిమాతో ఆమె కెరియర్ మలుపు తిరిగింది. వరుస ఆఫర్లు ఆమెకి రావడం మొదలయ్యాయి.
Advertisement
సింహాద్రి తర్వాత ఆమె చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో సినీ పరిశ్రమకు దూరమైపోయింది. తెలుగు లోనే కాక ఈ భామ ఒక కన్నడ సినిమా మూడు తమిళ సినిమాలు కూడా చేసింది తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె సినిమాలని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 2016లో విశాల్ జగతాప్ ని అంకిత పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె నటనకి పూర్తిగా దూరమైంది. భర్తతో పాటు ఆమె న్యూ జెర్సీలో సెటిల్ అయింది.
Advertisement
వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం అంకిత ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని పంచుకుంది పెళ్లయిన తర్వాత ఫ్యామిలీతో బిజీ అయిపోయానని చెప్పింది.
ప్రేమించి విశాల్ జగతాప్ ని పెళ్లి చేసుకుంది ఈమె. 2015లో మొదట పరిచయం అయ్యారు. అతనే మొదట ప్రపోజ్ చేశారని అంకిత చెప్పుకొచ్చింది. మంచి ఆఫర్లు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని అంకిత చెప్పింది. అంకితకి ఇద్దరు బాబులే పాప లేకపోవడం కొంచెం బాధగా ఉందని కూతురు ఉంటే బాగుండేదని అంకిత పంచుకుంది.
Also read: