Advertisement
రోజు రోజుకి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. గతం తో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో మనకి ఒక్కొక్కసారి పాత బిల్లులు వంటివి కనబడుతూ ఉంటాయి. తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజుల్లో ఎక్కడికైనా వెళ్లి తినాలంటే కచ్చితంగా ముగ్గురు మనుషులకి రూ.1000 వరకు అవుతోంది. ఆహారంతో పాటుగా ట్యాక్స్ కూడా చెల్లించాలి. ధరలన్నీ పెరిగిపోవడంతో రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్ ఫుడ్ ఆపరేటర్లు కూడా ధరలను బాగా పెంచేశారు.
Advertisement
ధరలు పెరగడంతో వినియోగదారుల మీద భారం పడుతోంది. నిజానికి ఇంట్లో చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు వంటివి ఉండవు. కానీ ఒక్కొక్కసారి ఇంట్లో తినడం కుదరక చాలామంది రెస్టారెంట్స్ లో తింటుంటారు. కొందరైతే లగ్జరీ కోసం బయటికి వెళ్లి తింటారు. ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో విధంగా ధరలు ఉంటాయి.
Advertisement
ఇప్పుడైతే ఎక్కడ చూసినా ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. 1965లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం వల్ల అన్ని హోటల్స్ టిఫిన్స్ ధరలు కూడా పెంచారు. రేపల్లెలోని హోటల్ యజమానులు అందరూ కలిసి పాంప్లెట్స్ ని ప్రింట్ చేశారు. ఆ పాంప్లెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దానిలో ఏముందంటే నవంబర్ 1, 1965 నుండి పెరిగిన రేట్లు, అధిక ధరల కారణంగా రేపల్లె హోటల్ యజమానులు అందరూ కూడా సమావేశమై కొత్త రేట్లని తీసుకొచ్చారని ఉంది. నవంబర్ 1 నుండి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని అందులో రాసి ఉంది. రెండు ఇడ్లీలు 15 పైసలు, అట్టు 15 పైసలు, ఉప్మా 15 పైసలు, రవ్వ అట్టు 20 పైసలు, రెండు గారెలు 15 పైసలు, బోండా 20 పైసలు, కాఫీ, టీ 15 పైసలు అని రాసి ఉంది. ఇవి చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Also read: