Advertisement
వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకని వానాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి అయితే వానా కాలంలోనే నాన్ వెజ్ ని తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..? తీసుకుంటే ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉండే ఉంటాయి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. వానా కాలంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్లు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి.
Advertisement
ముఖ్యంగా మాంసాహారం వలన ఎక్కువ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని శాకాహారం మాత్రమే వానా కాలంలో తీసుకోవడం మంచిది. వానాకాలంలో నాన్ వెజ్ ని తీసుకుంటే ఎక్కువ వ్యాధులు రావచ్చు. వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. నాన్ వెజ్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నట్లయితే మాంసాహారం పేగుల్లో కుళ్ళిపోయి ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు.
Advertisement
పైగా వర్షాకాలంలో పశువులకి కూడా అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి వర్షాకాలంలో కీటకాల సంఖ్య బాగా పెరుగుతుంది. చికెన్ గున్యా, డెంగ్యూ వంటివి కలగొచ్చు. అయితే ఇటువంటి కారణాల వలన జంతువులు కూడా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాయి అటువంటప్పుడు మాంసాహారం తీసుకుంటే కచ్చితంగా ప్రమాదంలో పడతాము.
మాంసాహారం తీసుకోవాలని అనుకుంటే తాజాగా ఉన్న చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు మాత్రమే తీసుకోండి. గుడ్లని నీటిలో వేసినప్పుడు మునిగితే అవి మంచివని తీసుకువచ్చని తెలుసుకోండి. ఏది ఏమైనా వానా కాలంలో ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైతే మాంసాహారం వానాకాలంలో తీసుకోకండి.
Also read: