Advertisement
వాస్తు ప్రకారం నడుచుకుంటే, మంచి ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. వాస్తు ప్రకారం హనుమంతుడు ఫోటో విషయంలో ఈ పొరపాటు చేయకూడదు. ఈ విధంగా ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. పూజ చేసే గదిలో దేవుడు ఫోటోలు ఉంటాయి. దేవుడు ఫోటోలు ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి.
Advertisement
Advertisement
వాస్తు ప్రకారం హనుమంతుని ఫోటోని ఎప్పుడు దక్షిణం వైపు పెట్టాలి. కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటోని పెడితే మంచిది. ఎరుపు రంగులో ఉండే ఫోటోని పెట్టండి. ఇలా పెట్టడం వలన ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి. ఉత్తర దిశలో పెట్టేటప్పుడు ఉత్తర ముఖి హనుమంతుని రూపంలో ఉండే ఆంజనేయస్వామి ని పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని పెడితే వ్యాధులు. ఆటంకాలు తొలగిపోతాయి. సంపద బాగా పెరుగుతుంది. పర్వతాన్ని ఎత్తుతున్న హనుమంతుడి ఫోటోని పెడితే ధైర్యం, బలం, విశ్వాసం కలుగుతాయి. తెలుపు రంగులో ఉండే హనుమంతుడి ఫోటోని ఇంట్లో పెట్టడం వలన ప్రమోషన్ వస్తుంది.
Also read: