Advertisement
ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాదాపు 150కి పైగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూపు 2 సహా ఇతర సిలబస్ తో కూడిన 21 పోటీ పరీక్షలున్నాయని పిటిషనర్లు కోర్టులో వాదిస్తున్నారు. గ్రూపు 2 పరీక్ష వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ జూన్ లోనే వినతి పత్రం అందించారు. అయినప్పటికీ కమిషన్ సభ్యులు స్పందించలేదని అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆగస్టు 01 నుంచి గురుకుల పరీక్షలు జరుగుతున్నాయి. ఆగస్టు 01 నుంచి గురుకుల పరీక్షలున్నాయి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలున్నాయి. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూపు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తుండటంతో గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు కమిషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement
తాజాగా గ్రూపు-2 అభ్యర్థులకు ఊరటను ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. గ్రూపు 2 పరీక్ష అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీటర్ లో పోస్ట్ కూడాచేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసేందుకు టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూపు 2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గౌరవ సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు ప్రకారం.. గ్రూపు 2 పరీక్ష నవంబర్ 02, 03 తేదీల్లో జరుగుతుందని TSPSC ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రూపు 2 పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో యాప్