Advertisement
వివాహం ద్వారా తన భర్తతో అత్తవారింటికి అడుగుపెట్టిన ఏ స్త్రీ జీవితంలోనైనా అతని కుటుంబం వారితో బంధుత్వం ఏర్పడుతుంది. మామగారు, అత్తయ్య, వదిన, మరదలు, మరిది, బావ, తోటి కోడలు వంటి సంబంధాలు ఆమె జీవితంలోకి కొత్తగా అడుగు పెడతాయి. కానీ అత్తగారు మరియు కోడలు మధ్య సంబంధం అన్నింటికంటే ముఖ్యమైనది. అలాగే అత్యంత సంక్లిష్టమైనది కూడా. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో అత్తగారు మరియు కోడలు ఇద్దరి మనస్సులలో అనేక పక్షపాతాలు మరియు గందరగోళాలు ఉండవచ్చు. అలా కాకుండా అత్తా కోడళ్ళ మధ్య మంచి రిలేషన్ కొనసాగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
Advertisement
#1. సర్దుకుపోవటం :
ఇంట్లో గొడవలు రావడానికి అసలు కారణాలు ఏంటో కనుక్కోండి. వాటిని ముందుగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితిలో, అత్త మరియు కోడల మధ్య సంబంధం మొదటి నుండి తెలివిగా ఏర్పరచుకోవడం చాలా అవసరం. అంతేకానీ.. ఫిర్యాదులు చేయకూడదు. మీ అత్తగారింటిని మీ సొంత ఇంటిగా భావిస్తేనే ఆ ఇంటి మర్యాదని కాపాడేందుకు కోడలుగా మీరు మీ అత్తగారి దగ్గర గుర్తింపు తెచ్చుకుంటారు.
#2. ఇష్టాలు తెలుసుకోవడం :
మీ అభిరుచులు మీ అత్తగారి అభిరుచులు ఒకే విధంగా ఎప్పుడు ఉండవు. మీరు ఏ పని చేసినా ఆవిడకి నచ్చకుండా మీ వెనకాల తప్పుగా మాట్లాడుతున్నట్లయితే.. ఆమెకి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆమె పెద్దవారు అని వదిలేయాలి తప్ప.. ఆమె తప్పులు నీ ఎత్తిచూపి అగరవంగా మాట్లాడకూడదు. అలాగే ఆమెకి ఏం ఇష్టమో గమనించండి.
#3. అర్థం చేసుకోవటం :
Advertisement
కొంతమంది అత్తలు వారి కొడుకుపై ప్రేమ వలన పెళ్ళికాగానే భార్య కొంగు పట్టుకుని తిరుగుతూ తమకి దూరమైపోతారని భయపడతారు. దీనిని కచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. భర్త కేవలం మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోవాలని అనుకోకూడదు. తల్లితో సమానంగా మిమ్మల్ని కూడా చూడాలని భావించాలి. ఈ అభిప్రాయం ఎప్పుడైతే మీలో ఉంటుందో ఎటువంటి గొడవలు రావు.
#4. ఫిర్యాదులు వద్దు :
ఈ కుటుంబాల్లో నైనా సరే గొడవలు అనేవి సర్వసాధారణం. కాబట్టి మీ అత్తగారితో మీకు జరిగే చిన్న చిన్న గొడవలను మీ భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులకు తెలియనివ్వకూడదు. దానివలన మీ ఇద్దరి మధ్య ఇంకా ఎక్కువ దూరం పెరగవచ్చు. ఆవిడ పై మీకు చాలా గౌరవం ఉందని విషయం ఆమె అర్థం చేసుకునేలా చేయాలి.
#5. గొడవ పడటం మానుకోవాలి :
కొంతమంది అత్తగార్లు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తూ గొడవ పడుతుంటారు. ఆమెకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో వారితో సమానంగా మీరు వాదనకి దిగొద్దు. నిదానంగా, ఓపిగ్గా సమస్యని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక ఆమెకు ఎంత చెప్పినా వినకపోయినట్లయితే సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మౌనం కొన్నిసార్లు చాలా సమస్యలకి పరిష్కారం ఇవ్వటమే కాకుండా గొడవలు లేకుండా చేస్తుంది.
Also read :
తన ప్రియురాలిని పరిచయం చేసిన “విక్రమ్” విలన్ ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
ఒక అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందా, లేకపోతే నటిస్తుందా అని ఎలా తెలుసుకోవాలి?
భర్త… భార్యకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి