Advertisement
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమా యావరేజ్ టాక్ తో మొదలై ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సినిమాలలో రాజకీయ నాయకులపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. తాజాగా విడుదల అయిన స్కంద సినిమాలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు అనిపిస్తుంది. ఎక్కువగా బాలయ్య సినిమాల్లో ఈ పొలిటికల్ సెటైర్స్ కనిపిస్తాయి. ఇక బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ సెటైర్స్ వేస్తూనే ఉంటారు. గతంలో చాలా సినిమాలలో ఇవి కనిపించాయి. ఇప్పుడు స్కంద సినిమాలో కూడా ఇది రిపీట్ అయ్యింది.
Advertisement
వీటిని కూడా చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్నా.. ఇప్పటికీ కలిసి ఉన్న జంటలు వీరే.. ఎవరో చూడండి!
Advertisement
ఈ సినిమాలో చాలా డైలాగ్స్ వైసీపీ ప్రభుత్వాన్ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అమలు అవుతున్న పధకాల డొల్ల తనాన్ని ఎత్తి చూపేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని సినిమా చోసిన ప్రేక్షకులు చెబుతున్న మాట.
వీటిని కూడా చదవండి: సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన టాప్ 10 సౌత్ ఇండియా యాక్టర్స్
అయితే.. అనుకోని పరిస్థితిల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో కొన్ని డైలాగ్స్ ను తీసేశారని తెలుస్తోంది. నిర్మాతలే రిక్వెస్ట్ చేసి మరీ వైసీపీ కి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ ని తీసేయించారని తెలుస్తోంది. కొన్ని డైలాగ్స్ కి డబ్బింగ్ మార్పించి తిరిగి చెప్పించారని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించకుండా ఉండి ఉంటె.. ఈ డైలాగ్స్ కూడా ఉండేవేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీటిని కూడా చదవండి: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబుల అసలు పేర్లు ఇవా?