Advertisement
ఏ ఆడపిల్ల అయినా కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. అందరు అమ్మాయిలకు కష్టాలు ఏముంటాయి. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు అని అంటూ ఉంటారు. కానీ, అసలు కష్టాలు పెళ్లి తోనే మొదలు అవుతాయని ఎవ్వరూ ఊహించారు. అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది అని చెప్పలేం కానీ.. పెళ్లి అయ్యాక ఆ కుటుంబంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది మాత్రం కోడళ్ళే. ఏమి జరిగినా.. తమ తప్పు లేకున్నా ఎక్కువగా కోడళ్ళే బాధ్యులు అవుతూ ఉంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి.. తన తల్లికి ఇలా లేఖ రాసింది. ఈ లేఖ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Advertisement
అమ్మా.. ఎలా ఉన్నావ్? నువ్వు బాగా గుర్తొస్తున్నావ్ అమ్మా.. నీ దగ్గర నుంచి వచ్చేసిన తరువాత నిన్ను తలుచుకొని రోజు లేదు అమ్మా.. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో.. ఇక్కడకు వచ్చాక నేను ప్రతి ఒక్కరిని అలాగే చూసుకోవాలి అని తెలుస్తుంటే గుండెల్లో బరువుగా ఉందమ్మా. నిన్న మొన్నటి దాకా నీ చేతి వంట తింటూ పెరిగిన నేను.. ఇప్పుడు ఇన్ని బాధ్యతలు ఒక్కసారిగా తీసుకోవాలంటే కష్టంగా ఉందమ్మా. ఇక్కడ ఎప్పుడు ఎవరు పిలుస్తారా? ఏ బాధ్యతను పూర్తి చెయ్యాలా అని అనుకుంటూనే రోజు గడిచిపోతోందమ్మా..
Advertisement
నాకు నీ దగ్గరకి వచ్చేసి నీ చేతి గోరు ముద్దలు తిని నీ ఒడిలోనే పడుకోవాలని ఉందమ్మా. ఇక్కడ అందరికి నచ్చిన వంటలు చేయాలి. నాకు నచ్చినట్లు ఉండడమే కుదరదు అమ్మ. నాకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి కూడా లేదు అమ్మా. పెళ్ళై వస్తే తప్ప.. మాకోసం నువ్వు ఎన్ని చేసావో తెలియరాలేదు నాకు. నాకు కూడా నీలా ఈ కుటుంబం నాది అని ప్రేమించడం నేర్చుకోవాలి అని ఉంది. నువ్వు మమ్మల్ని చూసుకున్నట్లే నేను ఈ ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటున్నా.. నువ్వెప్పుడు నాకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటావ్ అమ్మా.. నువ్వే నాకు ఆదర్శం అమ్మా..” అంటూ ఈ లేఖలో రాసుకొచ్చింది.
మరిన్ని..
“అపరిచితుడు” సినిమాలో ఈ క్లైమాక్స్ వెనుక అసలు అర్ధం ఇదా? శంకర్ సినిమానా మజాకా?
ప్రభాస్ “కల్కి ” సినిమాలో రాజమౌళి రోల్ అదేనా? వైరల్ అవుతున్న న్యూస్!
“భగవంత్ కేసరి” సినిమాలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?