Advertisement
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అన్న సంగతి ఆసక్తికరంగా ఉంది. కామారెడ్డి నియోజక వర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయనకు పోటీగా బీజేపీ నుంచి గట్టి వ్యక్తిని బరిలోకి దింపుతారు అని చర్చ జరుగుతోంది.
Advertisement
కిషన్ రెడ్డి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోటీ చేసే ఛాన్స్ లేదని, విజయశాంతిని కానీ, ధర్మపురి అరవింద్ ను దింపుతారని మరికొందరు అనుకుంటూ ఉన్నారు. కానీ, వీరంతా కాకుండా తాజాగా తెరపైకి మరో పేరు వినిపిస్తోంది. అదే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. స్థానికంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు జనాల్లో ఫాలోయింగ్ కూడా ఉంది.
గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన వెంకట రమణ రెడ్డి వైఎస్ కు ప్రీతిపాత్రుడు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇప్పటికే అరవై కోట్ల రూపాయలకు పైగా సొంత డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేసాడు. ఆయన ఎవ్వరిని ఓట్లు అడగరు. అసలు గెలిచినా.. ఓడినా.. పట్టించుకోరు.
తన తండ్రి పేరు మీద ఆయన ఓ సంస్థని స్థాపించారు. తానూ చేయాలనుకున్న సేవా కార్యక్రమాలన్నీ తనపాటికి తానూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవ్వరిని సాయం అడగరు.
Advertisement
తాను సాయం చేసిన వ్యక్తులకు కండువా తొడిగి రాజకీయ రంగుని కూడా పులమడం ఉండదు. తాను చేయాలనుకున్న సాయాన్ని స్వచ్ఛమైన మనసుతో చేస్తుంటారు అంతే. కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీ చేయాలని గతంలోనే అనుకున్నారట.. అక్కడ గుళ్లను డెవలప్ చేయాలి అనే ఉద్దేశ్యంతో నిధులు విడుదల చేశారట. ఈ ఆదేశాలపై వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఈ ఆదేశాలను కూడా క్యాన్సిల్ చేశారట. కానీ, వెంకట రమణ రెడ్డి మాత్రం ఎప్పటినుంచో తన సొంత ఖర్చుతో గుళ్ళని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టో సంగతి పక్కన పెడితే.. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన మ్యానిఫెస్టో ఉంటుంది.
ఇందులో కామారెడ్డి నియోజక వర్గం కోసం 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించుకుంటున్నానని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కార్యాకలాపాల లిస్ట్ ను కూడా మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. పదవితో సంబంధం లేకుండా ఆయన అభివృద్ధి కార్యాకలాపాలను కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఇలాంటి వాళ్ళు కచ్చితంగా ఉండాలి అంటూ ఆయన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
- మరిన్ని తెలుగు రాజకీయ వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇవి చదవండి