Advertisement
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి విదితమే. కరోనా మహమ్మారి సమయంలోను, ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టగా, డీజిల్ ధరలు కూడా పెట్రోల్ కు పోటీగా నిలుస్తున్నాయి.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమేంటి?
ఎక్సైజ్ డ్యూటీ: భారత్ లో పెట్రోల్ ధరలు అధికంగా ఉండడానికి ఎక్సైజ్ పన్నులే ప్రధాన కారణం. దక్షిణాసియాలో భారత్ లోనే ఎక్సైజ్ సుంకం అధికంగా ఉంది. చమురు ధరల్లో సగం వరకు ఎక్సైజ్ పన్ను ఉంటుంది.
వ్యాట్: కేంద్రం వడ్డించే ఎక్సైజ్ సుంకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను- వ్యాట్ వసూలు చేస్తున్నాయి. ఈ పన్ను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు తగ్గించలేదు.
అధిక డిమాండ్: పెట్రోల్ ధరలు పెరుగుతున్న దానికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
జిఎస్టి కిందికి ఎందుకు తీసుకు రావడం లేదు: చమురు ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
రెట్టింపు ఆదాయం: ఎక్సైజ్ పన్ను పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం లభించింది. 2014-15 లో రూ. 99,000 కోట్లు ఉన్న ఈ ఆదాయం 2016-17 లో రూ.2,42,000కోట్లకు చేరింది.
పెట్రోల్ ధరను ఇలా పెంచేస్తున్నారు!
2017 సెప్టెంబర్ 14 నాటి రెట్ల ఆధారంగా, ఓసారి గణాంకాలు పరిశీలిద్దాం. అంటే ఎలాంటి పన్నులు లేకుంటే డీలర్ లాభం లీటర్ రూ.5 అనుకున్న లీటర్ పెట్రోల్ రూ.36 లోపే ఉంటుంది. కానీ ఇక్కడే అసలు కిరికిరి ఉంది. ఈ ధరకు ఎక్సైజ్ పన్ను, వ్యాట్ కలిపి కేంద్ర, రాష్ట్రాలు వినియోగదారుడు నడ్డి విరుస్తున్నాయి. ఇవన్నీ కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ అమ్మకం ధర 70. 38 పైసలు (2017 సెప్టెంబర్ 14 నాటి ధర) అవుతోంది. ఇందులో ఎక్సైజ్ సుంకం కేంద్రం, వ్యాట్ ద్వారా వచ్చే డబ్బులు రాష్ట్రాల ఖజానాకి చేరుతుంది. కేంద్ర, రాష్ట్రాలు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ ఎత్తివేస్తే ప్రజలకు 40 రూపాయల లోపే లీటర్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది.