Advertisement
పెళ్లి అనేది ఇరవైల వయసులో జరిగే వేడుక. అయితే జీవితాంతం ఓ మనిషికి మరో మనిషికి ఒకరికొకరు తోడు ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈ వేడుకని తీసుకొచ్చారు. అయితే జంటగా మారిన భార్యాభర్తల్లో మలి వయసుకి వచ్చాక ఎవరో ఒకరు ముందుగానే ఈ లోకాన్ని వీడి వెళిపోతే రెండో వ్యక్తి పరిస్థితి ఏమిటి? జీవితాంతం ఆ వ్యక్తి ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా? నిజానికి తోడు కావాల్సింది మలి వయసులోనే. ఈ వయసులో ఒంటరితనం ఎక్కువ అవుతుంది. పిల్లలు ఉన్నా ఒంటరితనం నీడ వదలదు. ఈ వయసులో కచ్చితంగా తోడు కావాలి.
Advertisement
ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు 62 ఏళ్ల రాధాకృష్ణ కురుప్. ఈయన కుత్తూరు పొట్టన్మల రెంజు భవన్కు చెందిన వ్యక్తి. భార్య మరణించడంతో ఈయన ఒంటరి అయ్యారు. ఈయనకు కూతుర్లు, కొడుకే దగ్గరుండి రెండవ పెళ్లిని ఘనంగా జరిపించారు. అదూర్ ఏనాదిమంగళానికి చెందిన 60 ఏళ్ల మల్లికా కుమారితో ఆయన వివాహాన్ని కవుంభాగం ఎరంగావు భగవతి గుడిలో జరిపించారు. ఈ పెళ్లి గురించి మాట్లాడిన రాధాకృష్ణ పని పూర్తి అయ్యి ఇంటికి వచ్చేసరికి విసుగు అనిపిస్తుంది. ఒక్కడినే ఉండడం చాలా బాధాకరం. హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుని తిని కూడా చాలా అవస్థలు పడ్డాను. కొడుకులు, కూతుర్లే చొరవ తీసుకున్నారు.
Advertisement
నా కూతురే ముందుండి చొరవ తీసుకుని నాకోసం సంబంధాలు చూసింది. ఈ క్రమంలోనే మల్లికా నెంబర్ దొరకడంతో ఆమెతో సంప్రదించి నా పిల్లలు పెళ్ళికి ఏర్పాట్లు చేసారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఇలా ఉంటె బాగుంటుంది. కొన్ని ప్రదేశాలను చూడాలని అనుకుంటున్నాం. ఈ వయసులో ఇది అవసరమా అని అడిగేవారు కూడా ఉన్నారని.. మా బంధువులతో సహా చాలా మంది ఎగతాళి చేశారని.. వారి అజ్ఞానం వలనే ఇలా అంటున్నారని.. వారి జీవితంలో వారికి ఈ పరిస్థితి ఎదురయినప్పుడు అర్ధం అవుతుందని అన్నారు. ఇక మల్లికా భర్త ఐదేళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు. రాధాకృష్ణ భార్య ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు రేష్మి, రంజు మరియు రంజిత్ అనే కొడుకు ఉన్నాడు. చిన్న కూతురు రంజు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు.. తండ్రి ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకుంది. మాట్రిమోనీ ద్వారా మల్లికా నెంబర్ ను పొందింది. మల్లికా బంధువులు కూడా ఇందుకు అంగీకారం తెలపడంతో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు.
Read More:
ప్రియుడిని ఇంటికి పిలిచింది.. దొరికిపోయేసరికి ప్లేట్ మార్చి, చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత?
Maa Oori Polimera Director Anil Vishwanath Age, Biography, Movies, Family Details
100 + Funny Telugu Riddles with Answers and Images సుడోకులు, పజిల్స్