Advertisement
ఈ ఫొటోలో ఉన్న తాతగారు ఓ లాయర్. ఆయన కేరళలో ఉత్తర పాలక్కాడ్ కు చెందిన వ్యక్తి. ఆయన పేరు పి. బాలసుబ్రమణ్యన్ మేనన్. మొన్న సెప్టెంబర్ 11 న ఆయన గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. సుదీర్ఘకాలం పాటు న్యాయవాదిగా కొనసాగినందుకు గాను ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. ఆయన గత 73 సంవత్సరాల అరవై రోజులుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన రోజూ ఆఫీస్ కి వెళ్తూనే ఉంటారు. తన క్లయింట్లను కలుస్తూనే ఉంటారు.
Advertisement
ఆయన ఏ కేసులోనూ సుదీర్ఘకాలం పాటు వాదించరు. క్లుప్తంగా వాదిస్తూ కేసు ను ముగించేస్తారు. సాక్ష్యాలు సరిగ్గా ఉంటె ఏ కేసు ని అయిన ముగించవచ్చని, ఎక్కువ కాలం పాటు చేసే సుదీర్ఘ కాలం వలన ఉపయోగం లేదని అంటుంటారాయన. ఆయన ఎక్కువగా సివిల్ కేసులను వాదిస్తూ ఉంటారు. ఆధారాలను పక్కాగా ఉంచుకుంటే కేసు స్ట్రెయిట్ గా తేలిపోతుందని అంటారు.
Advertisement
గతంలో ఒకాయన 70 ఏళ్ల 311 రోజుల పాటు న్యాయవాదిగా చేసిన రికార్డు ఉండేదట. ఆయన ఫిబ్రవరిలో మరణించారు. ఆ రికార్డు ను సుబ్రహ్మణ్యన్ తాజాగా బీట్ చేసారు. ఈ రికార్డు కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన 97 ఏళ్ల వయసు వచ్చిన తన వృత్తిలో కొనసాగడం. తనకి ఓపిక ఉన్నన్ని రోజులు, శరీరం సహకరించినన్ని రోజుల పాటు వృత్తిలోనే కొనసాగుతానని చెబుతున్నారు. చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అవుతున్న యువతరానికి స్పూర్తినిస్తూ.. ఆయన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటూ.. తన శరీరం సహకరించినన్ని రోజుల పాటు తన వృత్తిలోనే కొనసాగడం అనేది అద్భుతమైన విషయమే. తాను ఓపిక ఉన్నన్ని రోజులు వృత్తిలోనే కొనసాగుతానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా. ఈయనతో తీసుకున్న ఓ ఫోటోను సుమక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “మా తాతగారే నాకు ఇన్స్పిరేషన్” అంటూ పోస్ట్ చేసారు. వారిద్దరికీ తాతామనవరాళ్ల రిలేషన్ ఎలా వచ్చిందో తెలియకున్నా.. న్యాయవాదిగా ఈ తాతగారు మాత్రం అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Read More:
పాక్ సెమీస్ కు వస్తే ముంబైలో ఆడదు.. బీసీసీఐ స్పష్టం.. ఎందుకంటే?
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్
Motivational Bible Quotes in Telugu and తెలుగు బైబిల్ కోట్స్