Advertisement
చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న గురువారం ఉదయం 8.06 గంటలకు వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం మద్రాస్‌లోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పెళ్లి సమయానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన సినిమాటోగ్రఫీ శాఖామంత్రిగా పని చేస్తున్నారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తన పెళ్లి నాటి విశేషాలను పంచుకున్నారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకోవాలంటూ ఎన్టీఆర్ కోరారని.. అయితే ఒప్పుకోవడానికి మొదట్లో కొంత బెట్టు చేసానని సరదాగా చెప్పారు.
Advertisement
పెళ్లి చూపుల కోసం వెళ్ళినప్పుడే ఓ పెద్ద గజమాలను వేశారని.. కానీ అది మొయ్యలేక ఇబ్బంది పడ్డానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పెళ్లి చూపుల సమయంలోనే భువనేశ్వరితో మాట్లాడానని.. నేను పల్లెటూరిలో పుట్టి పెరిగానని, ఒకవేళ మంత్రి పదవి పోతే.. తిరిగి పల్లెటూరికి వెళ్లాలని భువనేశ్వరికి చెప్పానన్నారు. అందుకు భువనేశ్వరి.. భర్త ఎక్కడ ఉంటె భార్య కూడా అక్కడే ఉండాలని.. తన తండ్రి నేర్పారని తెలిపారు. ఆ మాటతో.. ఎన్టీఆర్ ఇంటికి అల్లుడిగా వెళ్లాలంటే అదృష్టం ఉండాలని అర్థమైందన్నారు.
Advertisement
పెళ్లి కుదిరిన తరువాత ఎన్టీఆర్ ని ఓ కోరిక కోరానని అన్నారు. కట్న కానుకలు ఏమీ వద్దు కానీ, పెళ్లి మాత్రం ఘనంగా జరిగితే చాలని అన్నానన్నారు. చిత్తూరు జిల్లాలోనే ప్రతి ఇంటికి శుభలేఖ పంపామని.. ఊహించని దాని కంటే ఎక్కువ మందే పెళ్ళికి వచ్చారని, ఏపీ మరియు తమిళనాడుకు చెందిన సినీ ప్రముఖులు హాజరు అయ్యారని అన్నారు. మనిషిని పూర్తిగా చదవాలంటే ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని అన్నారు. అభిమానులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని.. వారితో ఏకాంతంగా మాట్లాడాలంటే.. నన్ను కూడా బయటకు పంపేసేవారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టాలని ఎన్టీఆర్ కి సూచన చేసానని.. కానీ పార్టీ స్టార్టింగ్ లోనే నన్ను పార్టీలోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు.ఎన్టీఆర్ గెలిచాక.. రాజకీయాలు మానేసి వ్యాపారం వైపు వెళ్లాలని అనుకున్నానని.. కానీ ఆగష్టు సంక్షోభం వచ్చాకా.. రాజకీయాల్లోకి రాక తప్పలేదన్నారు.
Read More:
అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??