Advertisement
పాముల గురించి మనలో ఉన్న ఆపోహలు ఏంటి? వాటి గురించిన వాస్తవాలు ఏంటి? పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా? పాములు పగ పడతాయా? పాము కరిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందాం.
Advertisement
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తు పెట్టుకోవు. నిజానికి చాలావరకు పాములు పుట్ట నుంచి బయటకు వచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. మనుషులను గుర్తు పెట్టుకొని దాడి చేసేంత జ్ఞాపకశక్తి పాములకు ఉండదు. ఒక వ్యక్తి పై పాములు పలుసార్లు దాడి చేసి కాటు వేయడం యాదృచ్ఛికమే కావచ్చు.
Advertisement
నాదస్వరానికి పాములు ఎందుకు నాట్యం చేస్తాయి?
వాస్తవంగా అయితే పాములు గాలిలో శబ్ద తరంగాలను గ్రహించలేవు. అంటే నాగస్వరం నుంచి వచ్చే శబ్దానికి పాములు స్పందించవు. కానీ సినిమాల్లో, ఇతర మాధ్యమాల్లో పాములు నాదస్వరాన్ని ఊదేటప్పుడు అవి వాటికి అనుగుణంగా నాట్యం చేసినట్లు కనిపించడానికి కారణం వేరే ఉంది. ” నిజానికి పాముల వాళ్ళు నాదస్వరం ఓదేటప్పుడు నేల మీద చేతితో తడుతూ శబ్దం చేస్తారు. నేల ద్వారా ఆ వైబ్రేషన్ లో పాము శరీరానికి చేరుతాయి. దీంతో అది వాటికి స్పందించి పడగ విప్పుతుంది. అయితే పాము కళ్ళ ముందు నాగస్వరాన్ని కూడా అటు ఇటు కదుపుతూ ఊదుతూ ఉంటారు. దీంతో ఆ పాము కళ్ళతో చూసి, ఆ కదిలే వస్తువు ఆగగానే, దాన్ని కాటు వేయాలని అది కదులుతున్న దిశలో అటు ఇటు కదులుతుంది. కానీ చూసే వాళ్లకు మాత్రం పాము నాదస్వరానికి నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది” అని మంజులత బిబిసి తో చెప్పారు.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!