Advertisement
చాలామంది మహిళలు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. నిత్యం ఏదో ఒక పూజా నోము వంటివి ఆచరిస్తూ ఉంటారు అయితే భార్య చేసే పూజలు వ్రతాల్లో ప్రతిఫలం భర్తకు దక్కుతుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… భర్తలు వివిధ పనుల్లో బిజీగా ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉండే భార్యలు పూజలు అంటూ రోజుకు గుడికి వెళ్లడం ఇంట్లో ఎవరో ఒకరు గుడికి వెళ్తే ప్రతిఫలం భర్త పైన కూడా ఉంటుందని నమ్ముతారు. అలానే భార్య చేసే నోములు పూజల్లో భర్తకి ప్రతిఫలం దక్కుతుందని కూడా భావిస్తూ ఉంటారు. పురాణ ఇతిహాసాల ప్రకారం భర్త ఏ ధర్మకార్యం చేసిన ఆ పుణ్యం లో సగభాగం భార్యకు వస్తుంది.
Advertisement
భర్త చేసే పాపకర్మల్లో మాత్రం ఆమెకు భాగం వెళ్ళదు సహ ధర్మచారిని ఎన్ని పూజలు పూజా కార్యాలు చేసినా సరే ఆ ప్రతిఫలంలో కొంచెం కూడా భర్తకు దక్కదు. మన ధర్మ శాస్త్రాలు ఆత్మవైపుత్ర నామాసి అంటున్నాయి. అంటే తండ్రి ప్రతిరూపాలుగా కుమారులు ఉంటారు అందుకే తండ్రికి చెందిన సిరిసంపదలతో పాటు పుణ్య పాపాలలో కూడా పిల్లలకు భాగం ఉంటుంది. కుటుంబానికి పెద్దగా ఉండే పురుషుడు బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
Advertisement
Also read:
ప్రొటెం స్పీకర్ను ఎందుకు ఎన్నుకుంటారు..?
ఇంటి అతనిపైనే ఉంటుందని మన సనాతన ధర్మం చెప్తోంది. ఇంట్లో జరిగే అన్ని పూజ కార్యక్రమంలో భాగమవ్వాలి ప్రతి ధర్మకార్యాన్ని తానే బాధ్యతను వహించి పూర్తి చేయాలి. భార్య గుడికి వెళుతుంది కదా అని తాను తప్పించుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి ఇంటి పెద్ద పుణ్య కార్యాల్లో పాలుపంచుకోకపోతే ఫలితం దక్కదట. ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా పిల్లలు ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి ఈ బాధ్యత తనపై ఉందని పురాణాలు చెబుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!