Advertisement
ఈ రోజుల్లో జీన్స్ ధరించడం ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలు నుండి పెద్దల దాకా ఎక్కువ మంది జీన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు పురుషులతో పోటీపడి అమ్మాయిలు కూడా జీన్స్ వేసుకుంటున్నారు నిజానికి సీజన్ బట్టి మనం బట్టలు వేసుకోవాలి. కొత్త కొత్త ట్రెండీ జీన్స్ ని చాలా మంది అమ్మాయిలు వేసుకుంటారు. అయితే జీన్స్ కుడివైపు పైభాగంలో ఒక చిన్న పాకెట్ ఉంటుంది, అది ఎందుకు ఉంటుంది..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జీన్స్ ప్యాంట్లను మహిళలు పురుషులు పిల్లలు కూడా వాడుతున్నారు చాలా రకాల జీన్స్ ఉన్నాయి పైగా రకరకాల బ్రాండెడ్ జీన్స్ కూడా ఉన్నాయి.
Advertisement
Advertisement
మనం గమనించినట్లయితే జీన్స్ కుడి పాకెట్ పైన ఒక చిన్న పాకెట్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది చూస్తే… నాణేలు, చిన్న పెన్నులు వంటివి పెట్టుకోవడానికి అని చాలామంది అంటూ ఉంటారు కానీ అది తప్పు. దాని వెనక చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1953లో లెవీ స్ట్రాస్ అనే వ్యాపారవేత్త జీన్స్ ప్రారంభించారు పేటెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ముందు జేబు పైన చిన్న జేబును తయారు చేశారు. దీన్ని తర్వాత మార్కెట్లోకి వచ్చే ప్రతి కంపెనీ ఇలా డిజైన్ చేయడం మొదలుపెట్టింది.
Also read:
1980లో కంపెనీ డిజైన్‌ను లార్డ్ 50 జీన్స్ తో పరిచయం చేసింది. చిన్న జేబులో ఏదైనా ఉంచుకోవడం సాధ్యం కాదు. అయితే జీన్స్ వేసుకునే వాళ్ళు ఆ పాకెట్లో పాకెట్ వాచీలు పెట్టుకునేవారట. ఇలా ఆ చిన్న జేబును వాడుకునేవారట. కానీ ఇప్పుడు ఎవరు అలంటి వాచీలు వాడడం లేదు. చేతికి పెట్టుకునే వాచీలను మాత్రమే వాడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!