Advertisement
దోమల కారణంగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోమలు కుట్టాయి అంటే చాలు చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అందులోనూ సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయా..? దోమల నుండి బయటపడాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే దేశంలో అనేక ప్రాంతాల్లో డెంగ్యూ ఫీవర్ పెరిగిపోతోంది. మీ ప్రాంతంలో కూడా దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించండి. మీ ఇంటి చుట్టూ నీటి నిల్వలు ఉంటే వాటిని తొలగించాలి. నీరు నిల్వ ఉంటే దోమలు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి.
Advertisement
టబ్బులు, బకెట్లలో నీళ్లు నిలువ చేయకూడదు. తాగి పడేసిన కొబ్బరి బొండాలు టైర్లు వంటివి కూడా ఇంట్లో నుండి తీసి పారేయాలి. ముఖ్యంగా వానాకాలంలో మీ ఇంటి చుట్టూ ఉన్న కాలువలని శుభ్రంగా ఉంచుకోవడానికి చూసుకోండి. మీ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉంటే దోమల నివారణ మందుల్ని ఉపయోగించండి. దీని వలన దోమల బెడద ఉండదు.
Advertisement
Also read:
దోమలు మీ ఇంటి నుండి పారిపోవాలంటే బంతి, లెమన్ గ్రాస్, తులసి వంటి మొక్కలు ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. దీంతో దోమలు రావు. కర్పూరాన్ని వెలిగించి ఇంటి తలుపుల్ని మూసేయండి ఇలా చేస్తే కూడా దోమలు పారిపోతాయి నీటిలో తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని ఉడకబెట్టాలి. స్ప్రే బాటిల్ లో నింపి ఆ నీటిని పిచ్చికారి చేస్తే కూడా దోమలు పారిపోతాయి. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో మీరు దోమల నుండి బయటపడచ్చు. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!