Advertisement
మనం రాత్రి నిద్ర పోయేటప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను మర్చిపోతూ ఉంటాము కానీ కొన్ని కలలు మాత్రం ఎందుకు వచ్చాయో అని భయపడిపోతూ ఉంటాము. చనిపోయిన వాళ్ళు కలలోకి రావడం, ఇబ్బందుల్లో ఉన్నట్లు కలలు రావడం లేదంటే దయ్యాలు వెంటాడుతున్నట్లు ఇలా రకరకాలు కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలలు వెనుక పెద్ద కారణం ఉంటుందట. కలలో చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కలలో చిన్న పిల్లలు కనపడితే దాని వెనుక అర్థం ఏంటి..? మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.
Advertisement
డ్రీమ్ సైన్స్ లో ఇలాంటి విషయాలను ప్రస్తావించారు. రాత్రి కలలో చిన్న పిల్లలు కనపడితే దానికి సంకేతం ఏంటో ఇప్పుడు చూద్దాం… కలలో చిన్నారులు, అందమైన పిల్లలు కనపడితే మంచిదట. ఏవైనా సమస్యలు, బాధలు ఉంటే ఉపశమనం లభిస్తుందట ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు కలలు కనపడితే ఎంతో మంచి జరుగుతుందట. కలలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు కనపడితే మీ కోరికల్లో ఒకటి త్వరలో నెరవేరుతోందని అర్థం అని స్వప్న శాస్త్రం చెప్తోంది. చాలా కాలం నుండి ఉన్న కోరిక నెరవేరబోతోంది అని అర్థం.
Advertisement
Also read:
కలలో చిన్నారులు తప్పిపోయినట్లు కనపడితే ఆగిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తారని అర్థం. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయట. కలలో నవ్వుతున్నట్లు పిల్లలు కనపడితే చాలా మంచిదట. నవ్వుతున్న పిల్లలు తరచు కనపడితే వచ్చే రోజుల్లో శుభవార్త వింటారని. ఒకవేళ కలలో కవల పిల్లలు కనిపిస్తే మీ వృత్తి జీవితం బాగుంటుంది అని దానికి అర్థం. త్వరలోనే మీరు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుందట. మీ ఒడిలో చిన్నారి నిద్రిస్తున్నట్లు కల వస్తే దగ్గర బంధువుల్లో ఒకరికి ఈ బిడ్డ జన్మించే అవకాశం ఉన్నట్లు దానికి అర్థం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!