Advertisement
అనారోగ్యంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మరణం పై ప్రధాన నరేంద్ర మోడీ నుంచి సామాన్యుల దాకా సంతాపం తెలుపుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు రతన్ టాటా ఆరోగ్యం పై విపరీతమైన వదంతులు వచ్చాయి. ఆసుపత్రిలో రతన్ టాటా ప్రాణాలతో పోరాడుతున్నారని కథనాలు వెలువడ్డాయి. రతన్ టాటా ఈ విషయం పై స్వయంగా స్పందించారు.
Advertisement
సోషల్ మీడియాలో సోమవారం ఒక పోస్ట్ చేశారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఎన్నో రకాల పుకార్లు తనకి తెలుసని అవన్నీ నిరాధారమైనవని అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తనకు వయసు పైబడటంతో వివిధ రకాల అనారోగ్య పరిస్థితులు కారణంగా ప్రస్తుతం తాను మెడికల్ టెస్ట్లు చేయించుకుంటున్నానని చెప్పారు.
Advertisement
Also read:
Also read:
ఉల్లాసంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే ఆయన ఆఖరి పోస్ట్ అయిపోయింది. రతన్ టాటా మృతి తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!