Advertisement
ప్రముఖ నటుడు కమల్ హాసన్ అతిలోక సుందరి అయినా శ్రీదేవితో కలిసి 27 సినిమాల వరకు నటించారు. తెరపై వీళ్ళిద్దరూ ఎంతో రొమాంటిక్ కపుల్ గా నిలిచారు. కాకపోతే నిజ జీవితంలో వీళ్ళిద్దరూ అన్నాచెల్లెలు వలే ఉండేవారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ వెల్లడించారు. శ్రీదేవి ని నా చిట్టి చెల్లెలు అని అభివర్ణించడం జరిగింది. వీళ్లిద్దరూ కలిసి మొదటిసారిగా నటించిన చిత్రం మూడు ముడిచు. అప్పుడు జరిగిన రోజులు గురించి మాట్లాడుతూ నేను శ్రీదేవిని మొదటిసారిగా కలిసినప్పుడు ఈమె వయసు 15 లేక 16 సంవత్సరాలు మాత్రమే.
Advertisement
మేము ఇలా కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తెరపై ప్రేమ జంటగా కనిపించినా సరే నిజ జీవితంలో మేము తోడబుట్టిన వాళ్ల లాగే ఉండే వాళ్ళం. మేము కలిసి ఒకే స్కూల్ లో చదివాం, అందుకే మా మేనరిజమ్ కూడా ఒకే లాగా ఉంటాయి. కుటుంబ సభ్యుల లాగా మేము ఫీల్ అయ్యే వాళ్ళం.
Advertisement
Also read:
చాలామంది మమ్మల్ని చూసి మీరిద్దరూ ఒకేలాగా ఉంటారు అనేవారు. లుక్స్ పరంగా మేము సేమ్ ఉండేవాళ్ళం. కాకపోతే దర్శకులు మమ్మల్ని ఒక జోడి లాగా సినిమాల లో చూపించారు. దానికి మేం చేసేది ఏం లేకపోవడంతో యాక్టర్లుగా మా పాత్రలను మేము పోషించాము. ఆమెను కోల్పోవడం అంటే ఒక బంధువును కోల్పోయినట్లే అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!