Advertisement
సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే చాలు సినిమా హిట్టా, పట్టా పక్కనపెడితే ఆ సినిమాలోని చిన్న చిన్న మిస్టేక్ లను వెతికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే డైరెక్టర్లు అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇవి దర్శకులకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది మళ్లీ వాళ్ల వరకు చేరేదాకా ట్రోల్ చేస్తూనే ఉంటారు.. అయితే కొత్తగా వచ్చిన సినిమాలే కాకుండా ఎప్పుడో థియేటర్ లోకి వచ్చిన సినిమాలను కూడా ఈ తిప్పలు తప్పడం లేదు.
Advertisement
రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు వద్ద 25 వేల డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్బాబు పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇక్కడ దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో దర్శకుడే కలగజేసుకుని దీనిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే వరుణ్ తేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న ఫిదా సినిమాలో కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇందులో వరుణ్ తేజ్ ఎన్నారై పాత్ర చేయగా సాయి పల్లవి పక్క తెలంగాణ పిల్లగా నటించింది. నటించడమే కాదు తెలంగాణ యాసలో అదరగొట్టింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ తనతోపాటు అమెరికాలో ఉంటాడు.
Advertisement
అయితే ఇందులో వరుణ్ తేజ్ అన్న సాయి పల్లవి అక్కని పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళతాడు. కానీ ఈ సీన్ లో సాయి పల్లవి తన అక్క తో ఫోన్ మాట్లాడుతుంది. ఇదంతా బాగానే ఉన్నా ఫోన్ మాట్లాడే సమయంలో అమెరికాలో డే అయితే ఇండియాలో చీకటి అవుతుంది. కానీ రెండు సీన్స్ లో మాత్రం డే గానే కనిపిస్తుంది. ఈ మిస్టేక్ గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు శేఖర్ కమ్ముల అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ALSO READ: