Advertisement
కుంభకర్ణుడు రావణుడి సోదరునిగా మనందరికీ తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువులను పట్టుకొని మింగే ప్రయత్నం చేశాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడిని తరిమిన, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు, రావణునితో వెళ్లి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట.
Advertisement
also read; ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?
రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయడంతో దేవతలందరూ భయపడి, బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధిస్తాడో అని ఆందోళనగా తమను కాపాడమని బ్రహ్మను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద నిలబడి ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలి అని పలికించిందట. అడిగిన వరమే ఇచ్చాడు బ్రహ్మ. అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవని మన పురాణ కథలు చెబుతాయి. కుంభకర్ణుడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్టు పడేవారట.
Advertisement
అందుకే రామ, రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమైంది. ఈ సన్నివేశాలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. మేళ తాళాలు, ముక్కుల్లో గుణపాలు గుచ్చిన కుంభకర్ణుడు మాత్రం నిద్రలో నుంచి బయటకు రాలేదు. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచిన ఆకలి ఆకలి అని అరవడంతో, వెయ్యి మందికి సరిపడే ఆహారం ఒక్కడే ఆరగించేసాడు. ఆ తర్వాత రావణుడి కోరికతో, రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు వెళ్ళాడు. కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులతో పోటీ పడలేక బలహీనుడు అయ్యాడు. ఇదంతా ముందు జన్మ శాపం కారణంగా కుంభకర్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతాయి.
also read: అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు !