Advertisement
సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక గుర్తులు చూస్తూ ఉంటాం.. అవన్నీ రోడ్డు మార్గానికి సంబంధించిన సిగ్నల్స్. కానీ ఆ సిగ్నల్స్ ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ ప్రతి సిగ్నల్స్ కు ఏదో ఒక అర్థం ఉంటుంది. అందులో ఒక ట్రాఫిక్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. చాలామంది రోడ్లపై నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటారు. దీనికోసమే ట్రాఫిక్ కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. రోడ్డుపై ప్రమాదాలు నివారించడం కోసం సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.
Advertisement
వీటిని గమనించి మనం యుటర్న్ తీసుకోవాలా వద్దా ఓవర్ టేక్ చేయాలా వద్దా అనే విషయాలు తెలిసిపోతాయి. అయితే బెంగళూరు నగరంలో ఒక సైన్ బోర్డు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ బోర్డు పై ఎలాంటి లైన్స్ కూడా లేకుండా కేవలం నాలుగు బ్లాక్ పాయింట్స్ ఉన్న బోర్డ్ గమనించిన ఒక వ్యక్తి ఫోటో తీసి ట్వీట్ చేశాడు. బెంగళూరు నగరంలోని హోం పామ్ అనే ప్రాంతానికి సమీపాన ఉన్న సైన్ బోర్డు అర్థం ఏమిటి… అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అయితే దీని అర్థం తెలియక చాలామంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ ఎవరికీ సమాధానం దొరకలేదు. అయితే ఈ పోస్ట్ కు వైట్ ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ వెంటనే బదులిచ్చింది.
Advertisement
What traffic symbol is this?@wftrps @blrcitytraffic
This is put up just before Hopefarm signal!#curious pic.twitter.com/OLwW9gZiyy
— Aniruddha Mukherjee (@yesanirudh) August 1, 2022
దాని అర్థం ఏంటో తెలుపుతూ ట్విట్ చేశారు. ఈ నాలుగు చుక్కల సైన్ బోర్డు అర్థాన్ని వివరిస్తూ అంధులు నడిచే అవకాశం ఉంటుందని, వాహనదారులను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డులను ఏర్పాటు చేస్తారని అన్నారు. బెంగళూరు నగరంలోని హోమ్ ఫామ్ జంక్షన్ దగ్గర ఒక అంధుల పాఠశాల ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ బోర్డు అర్థం ఏంటో మీకు అర్థమైంది కదూ. ఇలాంటి బోర్డు కనిపించినప్పుడు వేగం తగ్గించుకొని వెళ్లాలని జాగ్రత్తగా వెళ్లాలని తెలుస్తోంది.
ALSO READ;