Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టుక చావు మధ్యలో వచ్చేదే వివాహం.. వివాహమనేది ఎవరికి వారే సొంతంగా నిర్ణయించుకునేది. రెండు మనసులు కలిస్తేనే వాళ్లు ఒక్కటవ్వుతారు .. కొంతమంది ప్రేమించే వివాహం చేసుకుంటారు. మరికొంతమంది పెద్దలు చూసిన వివాహం చేసుకుంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ జంటలు పీకల్లోతు ప్రేమలో పడి ఇక వివాహం చేసుకుంటారు అనే మూమెంట్ లో విడిపోయిన వారు అనేకం ఉన్నారు.. మరి వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం..
ఆర్తి అగర్వాల్-తరుణ్:
Advertisement
నువ్వు లేక నేను లేను అనే మూవీ ద్వారా వీరిద్దరి మనసులో ప్రేమ చిగురించింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కురిపించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కూడా బలపడింది. ఇక అప్పటి నుంచి రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. కానీ వీరి పెళ్లికి మాత్రం పెద్దలు ఒప్పుకోకపోవడంతో, ఆర్తి అగర్వాల్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళింది. కానీ తరుణ్ మాత్రం ఇంకా వివాహం చేసుకోలేదు. తర్వాత కొద్ది రోజులకు ఆర్తిఅగర్వాల్ వివిధ ఆరోగ్య సమస్యల తో మరణించింది. కానీ తరుణ్ ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు.. ఓ వైపు సినిమా అవకాశాలు లేక మరోవైపు ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తరుణ్ పరిస్థితి దారుణంగా తయారైంది.
ఉదయ్ కిరణ్-సుస్మిత :
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు పొంది ఇక తిరుగు లేదు అనే విధంగా అయ్యారు హీరో ఉదయ్ కిరణ్. ఆయన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా ను ప్రేమించారు. పెళ్లికి కూడా రెడీ అయిపోయారు.. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిపించారు.. కానీ ఉదయ్ కిరణ్ సుష్మితకున్న వెస్ట్రన్ అలవాట్లు నచ్చకపోవడంతో వివాహం రద్దు చేసుకున్నాడు.. ఇక అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ తగ్గుతూ వచ్చింది.
విశాల్-అనీషా :
స్టార్ హీరో విశాల్ కు నటి అనీషా రెడ్డితో నిశ్చితార్థం జరిగింది.. కానీ పెళ్లి జరగకుండా మధ్యలోనే ఆగిపోయింది.
also read: