Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
Advertisement
టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి చూస్తారు.. అయితే సినిమాల ఎంపికలో ఉదయ్ కిరణ్ చేసిన పెద్ద మిస్టేక్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వరుసగా లవ్ స్టోరీస్ చేయడమే ఆయన కెరీర్ ని ముంచిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ టైమ్ లోను ఇదే చర్చ నడిచింది. ఆయన ఒకటి, రెండు చిత్రాలు తప్ప అన్ని లవ్ స్టోరీలే చేశారు.
దీంతో ఉదయ్ కిరణ్ ఆడియన్స్ కి లవర్ బాయ్ గా చూసి బోర్ కొట్టేసిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఉదయ్ కిరణ్ మాస్ సినిమాలు చేయకపోవడమే ఆయన కొంప ముంచిందంటున్నారు. ఇప్పటివరకు స్టార్లుగా రాణిస్తున్న ఏ హీరో అయితే ఒకటి, రెండు లవ్ స్టోరీలు చేసి ఆ వెంటనే మాస్ యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపారు. లవ్ స్టోరీలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కానీ ఆ చిన్న లాజిక్ మిస్ అయినా ఉదయ్ కిరణ్ వరుసగా ప్రేమ కథ చిత్రాలు చేసి ఆడియన్స్ చేత బోర్ కొట్టించుకున్నారని అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వ్యక్తం అవుతుంది. ఇటీవల యంగ్ హీరో త్రిగున్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఉదయ్ కిరణ్, తరుణ్ లు చేసిన తప్పు తాను చేయదలచుకోలేదని తెలిపారు. ఇదే ఇప్పుడు ఉదయ్ ని, అభిమానులను వెంటాడుతున్న బాధ.
Advertisement
హీరోకి లాంగ్ రన్ ఉండాలంటే, చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే, సూపర్ స్టార్ గా ఎదగాలంటే, పరిశ్రమలో మనుగడ సాధించాలంటే, ఫ్యామిలీ చిత్రాలు, మాస్ సినిమాలు కూడా చేయాలనేది ఇప్పుడు రాణిస్తున్న అందరూ స్టార్ల విషయంలో నిరూపితమైంది. ఆ విషయం తెలుసుకునే ముందస్తుగానే అందరూ ఇప్పుడు సెటిల్ అయ్యారు. పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. కానీ ఉదయ్ కిరణ్ ఆ విషయంలో పెద్ద మిస్టేక్ చేశారు। చివరలో ‘జై శ్రీరామ్’ తో ఆ ప్రయత్నం చేసిన, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మరోవైపు ఉదయ్ కిరణ్, దర్శక ధీరుడు రాజమౌళి సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘సై’ సినిమాని ఉదయ్ తోనే చేయాలనుకున్నారట జక్కన్న. కానీ ఆయన నో చెప్పడంతో నితిన్ తో చేశాడట. ఆ సినిమా నితిన్ ని స్టార్ ని చేసిన విషయం తెలిసిందే. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడమే ఆయన కొంప ముంచిందంటున్నారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు స్టార్లలో ఒకరిగా ఉండేవాడని అంటున్నారు.
ALSO READ:పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది?