Advertisement
దసరా పండగ కి కొద్ది రోజుల ముందు ప్రతీ వాడ వాడ లో దుర్గాదేవి ప్రతిమలు ప్రతిష్టిస్తారు.. భక్తులు శరన్నవరాత్రులు తల్లిని వివిధ రూపాల్లో దర్శనం చేసుకుంటారు. మరి ఈ అలంకారాల్లో మనం ఏ అలంకారాన్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
also read:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో మీకు తెలుసా.. ఏ నెంబర్ ఉన్న పండ్లు మంచివంటే..?
స్వర్ణ కవచ అలంకార దుర్గామాత :
ఈ అలంకారంలో దుర్గాదేవిని పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి.
శ్రీ బాల త్రిపుర సుందరి దేవి :
ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా భావించి.. వారికి కొత్త బట్టలు పెడతారు.. ఈ రోజు పూజ చేస్తే మనస్సు బుద్ధి ఆహ్లాదకరంగా మారుతుంది..
శ్రీ గాయత్రి మాత:
సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన విద్రుమ, హేమ, దవల వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో గాయత్రి దేవి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే భక్తులు తన్మయత్వం చెందుతారని భావిస్తారు. ఈ రోజు పూజిస్తే సకల మంత్రసిద్ధి ఫలాలు పొందుతారని భక్తుల నమ్మకం.
Advertisement
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి :
ఈరోజు తల్లి చిరు మందహాసంతో చెరకుగడను చేత పట్టుకొని ఉంటుంది. సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మీ,సరస్వతి దేవుళ్లు ఇరువైపులా ఉంటారని నమ్ముతారు. ఈరోజు తల్లిని పూజిస్తే చాలా మంచిది.
శ్రీ సరస్వతి దేవి :
సకల విద్యలకు ఆది గురువుగా ఉన్న సరస్వతీదేవిని దర్శించుకుంటే మంచిదని నమ్ముతారు. ఈ రోజు అమ్మవారిని ఎక్కువ మంది విద్యార్థులు దర్శించుకుంటారు.
శ్రీ దుర్గా దేవి :
లోకానికి కంటకుడైన దుర్గమ్మ అసురుని వధించి దుర్గా దేవి గా స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించిందని చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గా దేవి అవతారాలు దర్శించుకుంటే సకల ప్రాప్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
మహిషాసుర మర్దిని :
దుర్మార్గుడైన మహిషాసురుని అంతమొందించి, శక్తిస్వరూపిణిగా మహిషాసుర మర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదు అని భక్తులు నమ్ముతారు.
శ్రీ రాజరాజేశ్వరీ దేవి :
వామ హస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో చక్రరాజ అధిష్టాన దేవి గా భక్తులు నమ్ముతారు. చెడుపై తల్లి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ రోజున విజయదశమి మరియు దసరా అని పిలుస్తారు.
also read:మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా..?