Advertisement
Pregnancy tips in Telugu: ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో పండ్లు తప్పక తినాలి. ఎందుకంటే పండ్లలో ఉండే విటమిన్లు,ఖనిజాలు, పోషక పదార్థాలు అనేకం గా ఉంటాయి.. అవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి ఈ ఏడు రకాల పండ్లను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి అవేంటో చూద్దాం..(గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహారం)
Advertisement
Pregnancy tips in Telugu
ఆరెంజ్ :
ALSO READ;ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..?
నారింజ పండు మిమ్మల్ని తేమగా ఉంచడమే కాకుండా విటమిన్ సి,పోలిక్ యాసిడ్ వంటి విటమిన్లను అందిస్తాయి. పోలిక్ యాసిడ్ అనేది పుట్టబోయే బిడ్డకు బ్రెయిన్, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. గర్భంతో ఉన్న మహిళలకు రోజుకు 600 మైక్రోగ్రాముల విటమిన్ బి అవసరం.
మామిడి:
మామిడి పండులో విటమిన్ ఎ,విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మీరు మామిడి పండ్లను తినాలి. దీనివల్ల ఇమ్యూనిటీ లోపాలు లేకుండా ఉంటాయి.
నిమ్మకాయ:
ప్రెగ్నెన్సీ సమయంలో రోజు నిమ్మరసం తాగాలి. దీనివల్ల మీకు వాంతులు, వికారం వంటివి రాకుండా ఉంటాయి.
Advertisement
అరటి :
అరటి పండులో పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దానికి అరటి పళ్ళు పరిష్కారం చూపిస్తాయి.
గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహారం
యాపిల్ :
యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, ఫైబర్, పొటాషియం ఉంటాయి. యాపిల్ పండ్ల వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. యాపిల్ ని తొక్కతో సహా తినండి.
బెర్రీస్ :
గర్భంతో ఉన్న సమయంలో బ్లూ బెర్రీస్, రాస్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు,విటమిన్ సి, ఫైబర్,పోలిట్,ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. మీ పుట్టబోయే బిడ్డకు ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి.
అవకాడో :
విటమిన్ బి అవకాడో పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి గర్భిణీలకు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి.
ALSO READ;నెయ్యి, బీర్లు, పచ్చళ్లను ఎన్ని రోజుల వరకు తినవచ్చు.. వాటికి Expire date ఉంటుందా !