Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు.టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇస్తారా పరిశ్రమలోనూ రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ లు శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు.
Advertisement
అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు తెరకేక్కించడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చైల్డ్ హుడ్ లో మదర్ తనని గైడ్ చేసిన విధానం సృజనాత్మకత పెంచి మంచి సినిమాలు తెరకెక్కించడానికి కారణమైందని చెప్పారు. చదువుకునే రోజుల్లో రాజమౌళి తల్లి గారు రోజు స్కూల్ కి వెళ్ళు, హోమ్ వర్క్ చేయి, బాగా చదవని ఇబ్బంది పెట్టలేదట. ఖాళీగా కూర్చుంటే ఆమె రెండే సూచనలు చేసేవారట. ఒకటి బయటికి వెళ్లి ఆడుకో లేదా కామిక్స్ చదువు అనేవారట.
Advertisement
రాజమౌళి మదర్ కామిక్స్, స్టోరీ బుక్స్ చదువు అని ఒత్తిడి పెట్టే వారట. దాంతో రాజమౌళి పుస్తకాల పురుగయ్యారట. తన చేతిలో బుక్ ఉంటే చాలు దాన్ని పూర్తిగా చదివేసేవాడట. ఆ విధంగా తన తల్లి ఓ గొప్ప దర్శకుడు కావడానికి పునాది వేసింది. ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారని రాజమౌళి చెప్పుకొచ్చారు. సాధారణంగా ఏ తల్లిదండ్రులైన క్లాస్ బుక్స్ చదవాలని కోరుకుంటారు. బాగా చదివి పిల్లలు ఏ డాక్టర్ ఇంజనీర్ కావాలని ఆశపడతారు. దానికి భిన్నంగా రాజమౌళిని ఆయన తల్లి కామిక్స్ చదివేలా ప్రోత్సహించింది. ఇక సినిమా పరిశ్రమలో పుట్టి పెరిగిన రాజమౌళి అనేక విభాగాల్లో పనిచేసి మేకింగ్ పై పట్టు సాధించారు. ఈ జనరేషన్ దర్శకుల్లో రాజమౌళి కంటే ప్రేక్షకుల పల్స్ తెలిసిన మరొక దర్శకుడు లేరు. సీరియల్ డైరెక్టర్ గా కెరిర్ మొదలుపెట్టి గ్లోబల్ రేంజ్ కి వెళ్లారు. ఇలా తన తల్లి వల్లే రాజమౌళి ఈ స్థాయికి ఎదిగారు.
Read also : “ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!