Advertisement
చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ కూడా సినిమాలపై ఆసక్తితో వస్తున్న చాలామందికి చిరంజీవి ఒక రోల్ మోడల్ అని చెబుతూ ఉంటారు.
Advertisement
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!
ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి తండ్రి ఒక కానిస్టేబుల్ అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఒక నటుడు అన్న విషయం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబు దర్శకత్వంలో మంత్రి గారి వియ్యంకుడు అనే సినిమా వచ్చింది.
Also Read: రాత్రిపూట మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు ఇది తెలుసుకోవాల్సిందే..?
Advertisement
ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే బాగుంటుంది అనే సందేహంలో దర్శకుడు ఉన్నప్పుడు, ఆ సమయం లో చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య గారు, మా బావగారు ఉన్నారు కదా, ఆయనతో వేయిద్దాం అంటూ సలహా ఇచ్చారట. అలా మంత్రి గారి వియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంకటరావు మంత్రిగా నటించారు. ఇక 1969లో వచ్చిన జగత్ జెట్టీలు అనే సినిమాలో కూడా ఆయన నటించారు. ఇక సినిమాలపై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పోషణ కోసం తన ఇష్టాన్ని త్యాగం చేశారు. అయితే ఆ ఇష్టాన్ని తన కొడుకు తో సినిమాలు చేయించి తన కోరికను తీర్చుకున్నాడు.