Advertisement
పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఒక్కసారి మూడు ముళ్లు వేశామంటే.. నిండు నూరేళ్లు కలిసి, మెలిసి ఉండాల్సిందే. అయితే, వివాహ బంధం కలకాలం ఉండాలంటే భార్యా భర్తల మధ్య నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. స్నేహితుడిలా నిజాయితీతో ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ చాలా సందర్భాలలో భార్యాభర్తలు స్నేహితులుగా ఉండలేరు. సమాజ పరిస్థితులకు కట్టుబడి ఉంటారు.
Advertisement
మీరు భర్త లేదా భార్యగా మారిన తర్వాత కావాలనుకున్న మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. అప్పుడు మీ సంతోషకరమైన సంబంధం దెబ్బతింటుంది. అయితే.. భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ నాలుగు విషయాలు ఎంటోఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
భార్య కోపాన్ని మాత్రమే కాకుండా తనలోని ప్రేమని, ఇష్టాలని తెలుసుకునే ప్రయత్నం ప్రతీ భర్త చేయాలి. తను ఎలా ఉంటున్నాడో తన భార్య కూడా అలానే ఉండాలి అనే కండిషన్స్ పెట్టకుండా నెమ్మదిగా తన భార్యను మార్చుకునే ప్రయత్నం చేసి, తన ఇంట్లో వాళ్లతో ఎలా మెలగాలో నెమ్మదిగా నేర్పించాలి. అందరి ముందు భార్యతో గొడవలు పెట్టుకోకుండా తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడూ పనిలో మునిగిపోకుండా భార్య చిన్నచిన్న ఆనందాలను, కోరికలను తీర్చాలి. పుట్టినరోజు, పెళ్లిరోజులకి గుర్తుంచుకోని వారి ఆనందం కోసం బహుమతులు ఇవ్వాలి. బయటకి తీసుకెళ్లాలి. భార్య తరపున చుట్టాలకి వారి కుటుంబానికి గౌరవం ఇవ్వాలి. భార్య గురించి భర్త ఈ విషయాలు తెలుసుకుంటే.. భార్యలతో గొడవలు రాకుండా ఉండి.. వారి జీవితం ఆనందంగా ఉంటుంది.