Advertisement
తెలుగు సినిమా ప్రేక్షకులకు పూరి జగన్నాధ్ పరిచయం అవసరం లేని డైరెక్టర్. ఎలాంటి సినిమా వ్యక్తుల బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సొంతంగా సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన పూరి జగన్నాధ్ తన సొంత కంటెంట్ తో నిలబడ్డాడు. ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పూరి జగన్నాధ్ ఇప్పుడు ఎందరో యంగ్ డైరెక్టర్లకు స్ఫూర్తిని ఇస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అందుకున్న పూరి జగన్నాధ్ చివరగా లైగర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.
Advertisement
ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఇది ఇలా ఉంటె.. ఇటీవల పూరి జగన్నాధ్ తల్లి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో పూరి జగన్నాధ్ పరిస్థితుల గురించి వివరించారు. తన కొడుకు పడ్డ కష్టం ఎవ్వరూ పడకూడదని అన్నారు. డిగ్రీ పూర్తి అవ్వగానే సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీ వైపుకు వచ్చేసాడని చెప్పుకొచ్చారు. ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాల పిచ్చితో ప్రయత్నాలు చేసేవాడని అన్నారు.
Advertisement
దర్శకుడు కాకముందే చాలా కష్టపడ్డాడని.. ఓ సారి హైదరాబాద్ వెళ్లి పూరి జగన్నాధ్ ను చూసేసరికి కాళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయని.. ఇవన్నీ ఎందుకు ఊరు వచ్చేస్తే పొలాలు చూసుకోవచ్చు కదా అని అంటే వినలేదని ఆమె చెప్పుకొచ్చారు. అన్నం తినకుండా నీళ్లు తాగిన రోజులు చాలానే ఉన్నాయని బాధ పడ్డారు. ఆయన దగ్గర పని చేసే ఓ కుర్రాడు నమ్మించి ఎనభై కోట్ల రూపాయలు కొట్టేసాడని చెప్పారు. ఆ తరువాత పూరి సినిమా ఒకటి లాస్ రావడంతో.. కొనుకున్న ఐదు ఇళ్ళు అమ్మేసి రోడ్డున పడ్డాడని చెప్పుకొచ్చారు. అడిగిన వారికి కాదనకుండా పూరి జగన్నాధ్ సాయం చేసేవారు అంటూ ఆయన తల్లి అమ్మాజీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Read More:
Ambajipeta Marriage Band Review : సుహాస్ కెరీర్ లో బెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. !
Miss Perfect Web Series Review : మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ హిట్టా..? ఫట్టా..?
Pawan Kalyan Janasena: పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్