Advertisement
Apollo Fish in Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండుసార్లు చేపలను తింటే మంచిది.
Advertisement
దీంతో మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు. Apollo Fish అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది. అయితే అపోలో ఫిష్ లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 350 మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలని వైద్యులు చెబుతున్నారు.
Read also: Sadine Fish, Uses and Benefits సార్డిన్ చేప
Apollo Fish Benefits, Uses, Images, Name in Telugu: అపోలో ఫిష్
అపోలో చేపను ఎముకలు లేని ఫిల్లెట్లతో వండుతారు. ఇది మాంసం రుచిని పూర్తిగా గ్రహించే అవకాశాన్ని ఇస్తుంది. అపోలో ఫిష్ లో అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది మెదడు నరాలకు మంచి ఆహారం అని చెప్పవచ్చు.
ఈ చేపను ఖనిజాలు మరియు విటమిన్లు మెదడులోని నరాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి అతిపెద్ద వనరులలో ఇది ఒకటి. అపోలో ఫిష్ చేప మార్కెట్లో 1 కేజీ 600 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అలాగే వీటిని ఆన్లైన్ మరియు ఫుడ్ డెలివరీ ఆప్ లలో బుక్ చేసుకోవచ్చు.
ఇవి ఎక్కువగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో దొరుకుతాయి. అయితే ఈ ఫిష్ లోని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Benefits of Apollo Fish Telugu
- అపోలో ఫిష్ తినడం వల్ల పిల్లల్లో ఆస్తమా వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు, అలాగే నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఫిష్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
- అపోలో ఫిష్ ఒమేగా 3 యొక్క ముఖ్యమైన మూలాలలో ఒకటి, శరీరానికి అవసరమైన చాలా ముఖ్యమైన విటమిన్.
- అపోలో ఫిష్ పిల్లలకు వారి చిన్న వయసు నుండే వారి మెదడు అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది.
- ఇందులో అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఈ ఫిష్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ లను కొంతవరకు నివారించవచ్చు.
- ఈ చేపలు మెదడు నాడిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి.
అలాగే వీటిని తీసుకోవడం వల్ల అనర్ధాలు కూడా పొంచి ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం..
* ఇందులో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉన్న కారణంగా అలర్జీ లక్షణాలను కలిగిస్తుంది. దద్దుర్లు లేదా దురద, గొంతు నొప్పి గనుక ఉంటే ఈ చేపలను తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.
* గర్భిణీ స్త్రీలు గర్భాస్రావం లేదా పిండం దెబ్బతినే అవకాశాన్ని నివారించడానికి ఈ చేపల వినియోగాన్ని పరిమితం చేయాలని వైద్యుల అభిప్రాయం.
* వికారం లేదా అనారోగ్యానికి కారణమయ్యే టాక్సిన్ సంభావ్యవతను నివారించడానికి చేపలను తినకూడదు. అలాగే పచ్చి చేపలను తినడం వల్ల టాక్సోప్లాస్మా వంటి బ్యాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అందుకే వీటిని తినే ముందు ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read also: దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?