Advertisement
సాధారణంగా సినిమా రంగం అయినా.. క్రీడా రంగం అయినా ఎప్పుడు ఎవ్వరికీ ఏది శాశ్వతం కాదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. ఎందులో ఎప్పుడు ఎవ్వరూ నిలకడగా ఉండరు..? క్రికెట్ రంగం గురించి తీసుకున్నట్టయితే.. ఒకప్పుడు కపిల్ దేవ్, ఆ తరువాత సచిన్, సెహ్వాగ్, గంగూలి, ధోని, ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి క్రీడాకారులు రాణిస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో హార్దిక్ పాండ్యా టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Advertisement
ఆల్ రౌండర్ షో తో అదుర్స్ అనిపిస్తున్నారు. కేవలం టీమిండియానే క్రికెట్ ఏదైనా సరే.. హార్దిక్ పాండ్యా ఉంటే.. ఆ టీమ్ విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నాడు. ఈసారి గాయం కారణంగా ప్రపంచ వరల్డ్ కప్ లో మధ్యలోనే ఆగిపోయాడు. క్రికెట్ కప్ మిస్ అయింది. అలాంటి ఆల్ రౌండ్ కి హార్దిక్ పాండ్యాకి దీటుగా మరో ఆల్ రౌండర్ దొరికేశాడు. అచ్చం హార్దిక్ లాంటి బ్యాటింగ్, మీడియం ఫేస్ బౌలింగ్, దూకుడైన కెప్టెన్సీ.. అతడు ఎవ్వరో కాదు.. మహారాష్ట్ర యువ సంచలనం. భారత జట్టు అండర్ -19 ఆటగాడు అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ లో టీమిండియాకి సారథ్యం వహిస్తున్నాడు అర్షిన్. తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. దుబాయ్ వేదికగా అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కులకర్ణి సత్తా చాటాడు. బౌలింగ్ లో 3 వికెట్లు తీసి.. బ్యాటింగ్ లో అయితే 70 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచి భారత్ కి తొలి విజయాన్ని అందజేశాడు. అయితే ఈ అర్షిన్ కులకర్ణి గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించాడు అర్షిన్ కులకర్ణి. అతని తండ్రి అతుల్ కులకర్ణి తండ్రి డాక్టర్. అయితే అతుల్ కులకర్ణి కూడా క్రికెటర్ అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలం చెందాడు. క్రికెటర్ కావాల్సిన అతను.. డాక్టర్ అయ్యాడు. తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలోనే తన కుమారుడికి చిన్నప్పటి నుంచే క్రికెట్ మెళుకువలను నేర్పించాడు. అర్షిన్ షోలాపూర్ శిక్షణ పొందాడు. అతనిలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన కోచ్ లు మెరుగైన క్రికెట్ అవకాశాల కోసం పూణేకు మకాం మార్చమని సూచించారు. ఇక అదే సమయంలో మహారాష్ట్ర అండర్ 14 జట్టులో అర్షిన్ కులకర్షికి చోటు లభించింది. దీంతో తన తండ్రి పూణేకు ఫ్యామిలిని షిప్ట్ చేశాడు.
పుణేలోని కాడెన్స్ అకాడమిలో అర్షిన్ తన స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నాడు. ఓ వైపు క్రికెట్ తో ప్రయాణం సాగిస్తూనే.. చదువును కూడా కొనసాగించాడు. వారానికి నాలుగు రోజులు షోలాపూర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కి వెళ్లి విద్యనభ్యసించేవాడు. ఇక ఆ తరువాత వినూ మన్కడ్ ట్రోపీలో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు కులకర్ణి. మహారాష్ట్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో సైతం అద్భుతంగా ఆడాడు. ఈ తరుణంలోనే అండర్ 19 ఆసియా కప్ జట్టుకు అర్షిన్ న్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అండర్-19తో పాటు దేశవాళి క్రికెట్ లో కూడా ఈ యువ ప్లేయర్ రాణిస్తే ఐపీఎల్ లో కూడా ఛాన్స్ వస్తుంది. ఐపీఎల్ లో ఛాన్స్ వచ్చి అందరినీ ఆకట్టుకుంటే టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడటం ఖాయం. ఐపీఎల్ లో రాణించే ఛాన్సులు కొట్టేసిన రింకూ సింగ్, తిలక్ వర్మ లాగా కులకర్ణి కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశముంది. ఇక అతని ఆట చూసిన మాజీలు టీమిండియా మరో హార్దిక్ పాండ్యా ఇతడేనని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే హార్దిక్ పాండ్యాను సైతం కలిశాడట. ఏది ఏమైనప్పటికీ అర్షిన్ కూడా హార్దిక్ పాండ్యా లాగే రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం.