Advertisement
సాధారణంగా స్మార్ట్ ఫోన్ లు, యాప్ లు గేమ్ లు సోషల్ మీడియా పిల్లలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. వారి సాధారణ మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎంత ఆలస్యంగా స్మార్ట్ ఫోన్ లేదా సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తే అంత మంచిదని నిపుణులుంటారు. దాదాపు 11, 15 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,300 మంది బాలికల్లో 60 శాతం మది అపరిచితులు, స్నాప్ చాట్ వినియోగదారుల నుంచి అసౌకర్య సందేశాలను అందుకున్నారని కనుగొన్నారు.
Advertisement
Advertisement
టిక్ టాక్ వాడకం విషయంలో కూడా అదే జరిగింది. ఫోన్ వల్ల కూడా పిల్లలు తమను తాము హాని చేసుకోవచ్చు. అలాగే ప్రతి ప్లాట్ ఫారమ్ ఇన్ బాక్స్ చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది చెడు ఉద్దేశవాలతో చెడు సందేశాలు పంపుతారు. పిల్లల మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొంతమంది అసలు అన్నం తినడం లేదని.. ఫోన్ ఇవ్వడం వల్లనే వారికి ఫోన్ తెలుస్తుంది. వారికి ఫోన్ గురించి ఏమాత్రం తెలియకుండా పెంచగలగాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్ అవసరం లేకున్నా వాడకూడదు. కేవలం వారి దృష్టిలో ఫోన్ అంటే ఇతరులతో మాట్లాడుకోవడానికి ఒక పరికరం అని మాత్రమే మనం నేర్పించాలి. గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చి వారి లేత కళ్లను, బ్రెయిన్ ని మీరే నాశనం చేస్తున్నారు. బాధ్యత గల తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడటం ఉత్తమం.