Advertisement
ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చి చాలా మంది మరణించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం అని చాలా మంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి చూద్దాం.. సాధారణంగా గుండెజబ్బుల నుంచి మనం బయటపడాలంటే శాకాహారమే తినడం మేలు అని అంటున్నారు. శాకాహారంలో అధికశాతం ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
Advertisement
అలాగే శరీరానికి హాని కలిగించే టువంటి సాచ్యురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. తక్కువ మోతాదులో ఉండే కొవ్వు,సోడియం,అధిక శాతం ఫైబర్,పొటాషియం వల్ల గుండె జబ్బులు రానివ్వకుండా కాపాడుతుంది. మాంసాహారం తినే వారితో పోలిస్తే శాకాహారులు చాలా సన్నగా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన బిఎంఐ కలిగి ఉంటారు. మాంసాహారుల తో పోలిస్తే శాకాహారం తినే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. మాంసాహారంలో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్,రక్తపోటు, ఒబేసిటీ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా మరణించే అవకాశం ఉంటుంది.
Advertisement
Also Read: మహిళలు సబ్జా గింజలు తింటే ఇంత మంచిదా..?
ఫైబర్ లేని మాంసాహారం తినే వారిలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శాకాహారులు అధిక కొవ్వు ఉండే జంక్ ఫుడ్ వంటివి కూడా తినకూడదు. శాకాహారులైన కొవ్వుపదార్థాలు తిని శారీరకంగా శ్రమ చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మాంసాహారంతో పోలిస్తే మాత్రం శాకాహారం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ALSO READ: కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..!