Advertisement
YS Vivekananda Reddy: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హ* కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ మూడవసారి సిబిఐ విచారణకి హాజరయ్యారు. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి ఆయన మూడవసారి విచారణ కోసం వెళ్లారు. తొలిసారి జనవరి 28న, రెండవసారి ఫిబ్రవరి 24న సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. కాగా నేడు మూడవసారి సిబిఐ విచారణ కి హాజరయ్యారు. అవినాష్ రెడ్డిని నేడు 5 గంటల పాటు విచారించారు సిబిఐ అధికారులు. అయితే 2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి హ* జరిగిన తర్వాత ఇప్పటివరకు ఆయన వ్యక్తిగత విషయాలపై పెద్దస్థాయి నాయకులు ఎవరు మాట్లాడలేదు. కానీ ఈరోజు సిబిఐ విచారణ అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
వివేక హ* వెనక భారీ కుట్ర దాగి ఉందని, ఆస్తుల కోసమే ఆయనను చంపారని చెప్పారు. వివేకానంద రెడ్డి హకు కుట్ర పన్నింది ఆయన సొంత అల్లుడు రాజశేఖర్ ఏనని, తప్పించుకోవడానికి తనపై ప్రత్యరోపణలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సోదరి సునీత తనపై ఎన్ని విమర్శలు చేసినా ఇప్పటివరకు మౌనంగానే ఉన్నానని, ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని, అందుకే ఇప్పుడు నోరు తెరుస్తున్నానని చెప్పారు. నేడు సిబిఐ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇన్నాళ్లు నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మా పార్టీ క్యాడర్ నన్ను ప్రశ్నిస్తోంది. ఇక నేను భరించలేను. నేను కూడా మాట్లాడడం మొదలు పెడతా. అందరి బండారం బయటపెడతా. వివేకా హత్యకు రెండవ పెళ్లే కారణం. ఆయన 2005లో ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అయితే తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత వారిని బెదిరించింది.
Advertisement
సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో షమీమ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. రెండవ వివాహం తర్వాత వివేక చెక్ పవర్ ను తొలగించారు. ఆ తర్వాత సునీత, వివేకా సతీమణి హైదరాబాద్ లో ఉంటే.. వివేకానంద రెడ్డి మాత్రం ఒంటరిగా పులివెందులలో ఉండేవారు. షమీమ్ కు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిని చేద్దామని వివేకా అనుకున్నారు. తన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడు. ఆస్తులన్నీ రెండవ భార్య పేరున రాయాలనుకున్నారు. ఈ ఆస్తులన్నీ వాళ్లకు వెళ్లిపోతాయని సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశారని నా అనుమానం. హ* జరిగిన ప్రాంతంలో లెటర్ ను మాయం చేశారు. నేను ఎక్కడా గుండెపోటు అని చెప్పలేదు. టిడిపి నాపై అలా ప్రచారం చేసింది. కుటుంబ సభ్యులు చెబితేనే నేను హ** జరిగిన ఇంటికి వెళ్లాను” అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.
Read also: ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?