Advertisement
స్త్రీ తప్పు చేయాలనుకుంటే ఇంట్లో ఉండే గడపకు కూడా తెలియదు అంటారు.. అలాంటి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వీళ్ల గురించి వివరిస్తూ మాధవ వెంకయ్య తన భాస్కర శతకం లోని ఒక పద్యం లో చెప్పాడు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చిత్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా!
తాత్పర్యం :
పూర్వ కాలంలో చిత్రాంగి అనే ఒక మహిళ తన కోరికలు తీర్చుకోవడం కోసం గుణవంతుడైన సారంగధరుని, తన కోరిక తీర్చమని కోరగా ఆయన నిరాకరించాడు.. దీంతో కోపం తెచ్చుకున్న చిత్రాంగి కుట్రలు,కుతంత్రాలు చేసి అతని కాళ్ళు చేతులు ఖండింపజేసింది. చిత్రాంగి లాంటి స్త్రీలు ఈ లోకంలో చాలామంది ఉన్నారని ఈమె కోరిక తీర్చలేదని అంతటి బలవంతుడని నాశనం చేసిందని.. అత్యధిక కోరిక ఉన్న స్త్రీలను నమ్మరాదని అర్థం..
also read:తమ్ముడి దెబ్బకు..రాజకీయాలకు గుడ్ బై ?
Advertisement
పూర్తి కథ :
రాజరాజ నరేంద్రుడు మరియు అతని కొడుకు సారంగధరుడు.. ఇతగాడికి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని భావించిన నరేంద్రుడు రాజ్యంలోని అందమైన అమ్మాయిల చిత్రపటాలను తెప్పించి అతనికి చూపిస్తూ ఉంటాడు. అలా చూస్తున్న క్రమంలోనే చిత్రాంగి చిత్రపటాన్ని చూసిన రాజరాజ నరేంద్రుడు ఆమె అందానికి ఫిదా అవుతాడు. ఆమెను ఏ విధంగా అయినా వివాహం చేసుకోవాలని తలచిన రాజరాజనరేంద్రుడు, మాత్రం తన కొడుకైనా సారంగధరుడుని చిత్రపటాన్ని ఆమెకు పంపిస్తాడు.. ఈ ఫోటో చూసిన చిత్రాంగి పెళ్లికి ఒప్పుకుంది.. రాజరాజనరేంద్రుడు క్షత్రియ పద్ధతిలో తన ఖడ్గాన్ని పంపించి దానితో చిత్రాంగికి పెళ్ళి జరిపించి తన రాజ్యానికి తీసుకొచ్చేలా తన వాళ్లను పురమాయిస్తాడు..
ఆ విధంగా చిత్రాన్ని రాజరాజనరేంద్రుని భవనంలోకి అడుగుపెట్టి అసలు విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది.. ఏమి చేయలేక అతనితోనే అడ్జస్ట్ అవుతుంది. ఒక సమయంలో సారంగధరుడు పావురాలతో ఆడుకుంటూ ఉండగా.. ఒక పావురం చిత్రాంగి మందిరంలోకి వెళుతుంది.. దాన్ని వెతుక్కుంటూ సారంగధరుడు కూడా చిత్రాంగి గదిలోకి వెళ్తాడు.. ఆ విధంగా సారంగధరుడు చూసిన చిత్రాంగి అతనితో కోరిక తీర్చుకోవాలనుకుంటుంది. వరుసకు కొడుకు అవుతాడు అని కూడా ఆలోచించదు. అతడితో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ సారంగధరుడు ఆమెను తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న చిత్రాంగి.. రాజరాజ నరేంద్రుడితో తనతో తప్పుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేస్తుంది. దీంతో తండ్రి కొడుకు కాళ్లు,చేతులు కోయించివేస్తాడు.
also read:ఫిదా సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ బుజ్జి పెద్దోడయిపోయాడుగా.. చూస్తే..!!