Advertisement
పెళ్లి అంటేనే పెద్ద పండుగ. నిండు నూరేళ్లు.. ఓ జంట ఉండాలని.. వివాహాన్ని ఎన్నో సంప్రదాయాల మధ్య చేస్తారు. పెళ్లి తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని.. అన్యోన్యంగా ఉండాలి. అయితే… ఓ అమ్మాయి మాత్రం కాబోయే భర్త విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. వాటితో ఏకంగా ఓ అగ్రిమెంట్ నే రాసేసింది. తనను పెళ్లి చేసుకోనున్న వ్యక్తి చేత ఆ అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంది. ప్రస్తుత ఆ పెళ్ళికూతురు రాసిన షరతులతో కూడిన లేక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి, ఆ అమ్మాయి అగ్రిమెంట్లో రాసిన కండిషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్ .!
Advertisement
అగ్రిమెంట్లో ఆ అమ్మాయి ఏమి రాసిందో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ పెళ్లి కూతురు ఏమి రాసిందో చూద్దాం. తనకు కాబోయే భర్త నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలట. ఇంట్లో వండిన అన్నం తినడానికి ఎప్పుడు సరే అనాలట. ఇంట్లో రోజు చీర కట్టుకోవడానికి ఒప్పుకోవాలట. అలాగే, లేట్ నైట్ పార్టీ తనతో మాత్రమే జరుపుకోవాలట. ప్రతిరోజు వ్యాయామానికి తప్పనిసరిగా వెళ్లాలట. ప్రతి ఆదివారం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ని భర్త ప్రిపేర్ చేయాలట. వెళ్లిన ప్రతి పార్టీలో ఆమెతో కలిసి ఒక మంచి ఫోటోను తీసుకోవాలట.
ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగ్ కి తీసుకెళ్లాలంట. ఇలా కొన్ని కండిషన్స్ తో అగ్రిమెంట్ రాసింది. కోసమెరుపు ఏమిటంటే, ఆ షరతులపై సంతకం చేసేందుకు పెళ్ళికొడుకు సిద్ధమయ్యాడంట. ఈ కండిషన్స్ ను చూసి సోషల్ మీడియాలో నేటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. నీ పని అలా ఉంది అంటూ మరి కొందరు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
https://twitter.com/UtkarshSingh_/status/1546731159257620480?s=20&t=kwQkSZ5TiFpl4qkyY1F5_A