Advertisement
చాలా మందికి కేక్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా కేక్స్ ని ఇష్టంగా తింటారు. బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే కేక్ పక్కా ఉండాలి. సాధారణంగా కేక్ తయారు చేసేటప్పుడు అందంగా కనపడడానికి తయారీదారులు పలు రకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని వేస్తారు. కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ విభాగం.. ఆ రాష్ట్రంలో పలు బేకరీలో కేక్స్ ని పరిశీలిస్తే వాటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ అధికమవుతుంది. ఎక్కువ మోతాదులో ఈ రంగులను వాడడంతో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
శారీరిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయని పేర్కొంది. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్లతో ఈ ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ చాలా విషపూరితమైనవి అని పలువురు నిపుణులు చెప్తున్నారు. వీటిని తీసుకోవడం వలన చర్మం వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read:
వికారం, కంటి చూపు సమస్యలు, థైరాయిడ్ ఇలా అనేక రకాల సమస్యలకు దారితీస్తుందట. ఉబ్బసం, ఆస్తమా ఉన్న వాళ్లలో ఇది ఎక్కువగా ఉంటుందట. ప్రాసెస్ చూసిన ఫుడ్, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నారని హైపర్ ఆక్టివ్ న్యూరో బిహేవియర్ కి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి రసాయనాలు కలిపిన కేక్స్ ని పిల్లలకి పెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!