Advertisement
ఆచార్య చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య కొన్ని పొరపాట్లు చేయకూడదని కూడా చెప్పారు. చాణక్య పెళ్లయిన తర్వాత తెలియకుండా కూడా ఈ తప్పులు చేయకూడదని అన్నారు మరి పెళ్ళైన వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడే చూసేద్దాం. జీవితంలో ఆనందం దుఃఖం సూర్యుడు నీడలా ఉంటాయి. ఎప్పుడు మారతాయో తెలియదు. మనిషి జీవితంలో సమస్యలు వస్తే భార్యాభర్తలు ఏ కారణం చేతనైనా కానీ ఒకరినొకరు ఎగతాళి చేసుకోకూడదు.
Advertisement
జీవితంలో సమస్యలకు మన నోరు ప్రధాన కారణమని చాణక్య అన్నారు జీవితంలోని చిన్న చిన్న విషయాలను విస్మరించుకోవడం నేర్చుకోవాలి. ఇలా చేయకపోతే వైవాహిక జీవితం త్వరలో విచ్చిన్నమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. అలానే మాట్లాడుకోవడం మానేయొద్దని చాణక్య అన్నారు. ప్రతి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఒకరితో ఒకరు అందుకోసం మాట్లాడుకోవడం మానేయాలి మానేయకూడదు లేదంటే చిన్న గొడవ కాస్త పెద్దదవుతుంది అలానే పరస్పర గౌరవం చాలా ముఖ్యం భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే వాళ్ళ వైవాహిక బంధం బాగుంటుంది.
Advertisement
Also read:
Also read:
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవితాన్ని గడపడానికి డబ్బుపై అవగాహన ఉండాలి భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన ఉంటేనే భార్యాభర్తల అనుబంధం సాఫీగా సాగుతుంది. అలానే కోపంతో సమస్యలు పరిష్కారం అవ్వవు అని గుర్తుపెట్టుకోండి. కోపం వలన రిలేషన్ పాడవుతుంది తప్ప ఉపయోగం ఉండదు, కాబట్టి పెళ్లయిన తర్వాత ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా మీ వైవాహిక జీవితం లో సమస్యలు వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!